వడ్డీతో సహా చెల్లించాల్సిందే.. కార్వీ కేసులో బ్యాంకులకు ఊరట | Sakshi
Sakshi News home page

వడ్డీతో సహా చెల్లించాల్సిందే.. కార్వీ కేసులో బ్యాంకులకు ఊరట

Published Thu, Dec 21 2023 7:47 AM

SAT quashes Sebi orders relief to banks in Karvy case - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ కేసులో బ్యాంకింగ్‌కు అనుకూలంగా సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) బుధవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ), నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌డీఎల్‌)లు సంయుక్తంగా బ్యాంకులకు కార్వీ తాకట్టు పెట్టిన షేర్‌లను తిరిగి ఇవ్వాలని లేదా బ్యాంకులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కార్వీ రుణదాతలకు (బ్యాంకులకు) ఎన్‌ఎస్‌డీఎల్, ఎన్‌ఎస్‌ఈ, సెబీలు వార్షికంగా 10 శాతం వడ్డీ సహా షేర్ల విలువ రూ. 1,400 కోట్ల పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. 

కేసు వివరాల్లోకి వెళితే... 
క్లయింట్‌ సెక్యూరిటీలను  కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ దుర్వినియోగం చేసిననట్లు సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) 2019లో ధ్రువీకరించింది. బ్యాంకుల వద్ద రూ.2,300 కోట్లకుపైగా విలువైన ఖాతాదారుల సెక్యూరిటీలను స్టాక్‌ బ్రోకర్‌ తాకట్టు పెట్టినట్లు పేర్కొంది. అయితే తాము బ్రోకరేజ్‌ సంస్థకు ఇచ్చిన రుణాలకుగాను (ప్లెడ్జ్‌ ఆధారంగా) ఈ తనఖా షేర్లను సర్దుబాటు చేసుకుంటామని యాక్సిస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, బజాజ్‌ ఫైనాన్స్‌ సెబీని అభ్యర్థించాయి.

అయితే దీనిని సెబీ తిరస్కరించింది. తాకట్టు పెట్టిన సెక్యూరిటీలను బ్యాంకులకు బదిలీ చేయవద్దని రెగ్యులేటర్‌ డిపాజిటరీని ఆదేశించిన సెబీ,  ఈ షేర్లను తిరిగి క్లయింట్‌ ఇన్వెస్టర్లకు బదిలీ చేయాలని డిపాజిటరీని ఆదేశించింది. దీనితో రుణ దాతలు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. ట్రిబ్యునల్‌లో తాజాగా రెండు వేర్వేరు రూలింగ్‌ ఇస్తూ, సెబీ ఆదేశాలను తప్పుపట్టింది.

Advertisement
 
Advertisement