2023-24లో వృద్ధి 6 శాతం: ఎస్‌అండ్‌పీ  | S&P Global Ratings Retains India's GDP Forecast At 6% For FY 24 - Sakshi
Sakshi News home page

2023-24లో వృద్ధి 6 శాతం: ఎస్‌అండ్‌పీ 

Sep 26 2023 1:07 PM | Updated on Sep 26 2023 2:12 PM

S and P Global Ratings Retains India GDP Forecast At 6pc For FY24 - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) 6 శాతానికే పరిమితం అవుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనావేసింది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ మందగించడం, అసాధారణ రుతుపవనాల ప్రతి కూలతలు, వడ్డీరేట్ల పెంపు వంటి అంశాలు తమ అంచనాకు కారణంగా తెలిపింది. కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలిక ధోరణి అయినప్పటికీ, వార్షిక రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనాను 5 నుంచి 5.5 శాతానికి పెంచుతున్నట్లు పేర్కొంది. (ట్రేడింగ్‌పై మోజు, రా..రమ‍్మంటున్న లాభాలు, డీమ్యాట్‌ ఖాతాలు జూమ్‌)

అంతర్జాతీయ క్రూడ్‌ ధరల తీవ్రత దీనికి కారణంగా పేర్కొంది. కాగా, 2024-25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి అంచనాలను 6.9 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఎస్‌అండ్‌పీ తెలిపింది. 2022–23 భారత్‌ వృద్ధి రేటు 7.2 శాతంకావడం ఇక్కడ గమనార్హం.  మరోవైపు 2023లో ఆసియా పసిఫిక్‌ ప్రాంత వృద్ధి అంచనాను 3.9 శాతంగా అంచనావేస్తున్నట్లు ఎస్‌అండ్‌పీ తెలిపింది.   (ఉద్యోగులకు గుడ్‌న్యూస్..అంచనాలకు మించి భారీగా జీతాల పెంపు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement