P R Agarwala: లోదుస్తులకు ‘బ్రాండెడ్‌’ మార్కెట్‌..‘రూప’తో కమాల్‌..!

Rupa Group Chairman Shri P R Agarwala Conferred With Padma Shri Award - Sakshi

లోదుస్తుల తయారీకి సంఘటిత మార్కెట్‌ను ఏర్పాటు చేసిన సంస్థగా రూప అండ్‌ కంపెనీని చెప్పుకోవాలి. అప్పటి వరకు చాలా చిన్న కంపెనీలే లోదుస్తులను తయారు చేసి, స్థానికంగా మార్కెట్‌ చేసుకునేవి. దీంతో బ్రాండెడ్‌ లోదుస్తులతో కస్టమర్ల మనసు గెలవాలన్న ప్రహ్లాద్‌ రాయ్‌ అగర్వాల్‌ ఆలోచనే.. 1969లో  కోల్‌కతా కేంద్రంగా రూప అండ్‌ కంపెనీ ఏర్పాటుకు పునాది పండింది.

ప్రహ్లాద్‌ రాయ్‌ అగర్వాల్‌తోపాటు ఘనశ్యామ్‌ ప్రసాద్‌ అగర్వాల్, కుంజ్‌ బిహారి అగర్వాల్‌ సంయుక్తంగా కంపెనీని స్థాపించారు. నేడు దేశంలోనే అతిపెద్ద లోదుస్తుల బ్రాండ్‌ ఇది. రూప బ్రాండ్‌తో తొలుత లోదుస్తుల తయారీని చేపట్టినా, ఆ తర్వాత వింటర్‌వేర్, కిడ్స్‌వేర్, ఫుట్‌వేర్‌లోకి కంపెనీ అడుగుపెట్టింది. జాన్, ఫ్రంట్‌లైన్, యూరో ఇలా 18 పాపులర్‌ బ్రాండ్లు ఈ కంపెనీకి ఉన్నాయి.

‘‘నాణ్యమైన, బ్రాండెడ్‌ ఇన్నర్‌వేర్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతుందని మాకు అనిపించింది. దీంతో ‘రూప’ పేరుతో సొంత బ్రాండ్‌ ఏర్పాటు చేశాం. అంతే ఇంక వెనుదిరిగి చూసింది లేదు. కస్టమర్లకు మంచి అనుభవాన్ని ఇస్తూ మార్కెట్‌ను పెంచుకున్నాం’’ అని వ్యవస్థాపకులు చెప్పారు. 2020–21లో రూ.1,311 కోట్ల టర్నోవర్‌ను ఈ సంస్థ నమోదు చేసింది.   

చదవండి: వీధి కుక్కలు.. శంతన్‌నాయుడు.. రతన్‌టాటా.. ఓ ఆసక్తికర కథ !

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top