రెపో రేటు పెరగనుందా? .. నేటి నుంచి ఆర్‌బీఐ పాలసీ భేటీ

Reserve Bank of India Monetary Policy Committee Meeting starts on 03 april 2023 - Sakshi

అర శాతం రేటు పెంపునకు అవకాశం

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం సోమవారం నుంచి ప్రారంభం కానుంది.  మూడు రోజుల పాటు (3,5,6 తేదీల్లో... మహవీర్‌ జయంతి సందర్భంగా 4న సెలవు) జరగనున్న ఈ సమవేశాల్లో   రెపో రేటును మరో పావుశాతం పెంపునకు నిర్ణయం తీసుకోవడం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్‌బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 6.75 శాతానికి పెరగనుంది.

పాలసీ సమీక్ష నిర్ణయాలు 6వ తేదీన వెలువడనున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్‌ 8, ఆగస్టు 5, సెప్టెంబర్‌ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్‌ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఫిబ్రవరి మొదట్లో జరిగిన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపది విధానంలో వరుసగా ఆరవసారి (పావు శాతం) రేటు పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగింది. ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top