రిలయన్స్ డిజిటల్ దసరా ఆఫర్లు

హైదరాబాద్: దసరా సందర్భంగా రిలయన్స్ డిజిటల్ ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. బ్యాంకు కార్డులపై 10% తగ్గింపు ఇస్తున్నట్టు ప్రకటించింది. యాపిల్ వాచ్‌ను రూ.17,100కు, శామ్‌సంగ్ వాచ్‌ను రూ.6,490కు అందిస్తున్నట్టు తెలిపింది. అలాగే, స్మార్ట్‌వాచ్‌లు రూ.1,599 నుంచి అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది.
ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లపైనా ప్రత్యేక ఆఫర్లను ఇస్తున్నట్టు తెలిపింది. శామ్‌సంగ్ ఎం53 5జీ ఫోన్‌ను కేవలం రూ.19,999కు, శామ్‌సంగ్ ఎస్22ను రూ. 49,990కే ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. సమీపంలోని రిలయన్స్ డిజిటల్ స్టోర్లు లేదా మైజియో స్టోర్ లేదా రిలయన్స్‌డిజిటల్ డాట్ ఇన్ పోర్టల్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది.