లేటెస్ట్‌ ఐఫోన్స్‌: ఈ ఆఫర్లు తెలుసా మీకు? 

 Redington India to retail latest iPhone 15 Apple Watch series  - Sakshi

రెడింగ్టన్‌లో లేటెస్ట్‌ ఐఫోన్స్‌ 

iPhone 15 series , Watch Series 9 ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న యాపిల్‌ ఐఫోన్స్‌ 15 సిరీస్‌లు లాంచ్‌ అయ్యాయి.  అయితే లాంచ్‌ అయిన వెంటనే  లేటెస్ట్‌ ఐఫోన్‌ 15, యాపిల్‌ వాచ్‌ 9 సిరీస్‌  ఉత్పత్తులు భారత మార్కెట్లో అవకాశం ఈ ఏడాది ఐఫోన్‌ లవర్స్‌కు పండగే అని  చెప్పాలి. లేటెస్ట్‌ ఐఫోన్లు, యాపిల్‌ వాచ్‌లను దేశవ్యాప్తంగా ఉన్న తమ స్టోర్స్‌లో విక్రయించనున్నట్లు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ సంస్థ రెడింగ్టన్‌ లిమిటెడ్‌ తెలిపింది.

7,000 పై చిలుకు రిటైల్‌ స్టోర్స్‌లో ఐఫోన్‌ 15, 15 ప్లస్, 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్‌ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అలాగే, 2,800 స్టోర్స్‌లో యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 9, వాచ్‌ అల్ట్రా 3 కూడా లభిస్తాయని వివరించింది. స్మార్ట్‌ఫోన్స్, వాచ్‌ల లభ్యత, ధరల గురించి ఇండియా ఐస్టోర్‌డాట్‌కామ్‌ను సందర్శించవచ్చని కస్టమర్లకు సూచించింది. 

రూ. 5,000, రూ. 4,000 తక్షణ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అలాగే జీరో డౌన్ పేమెంట్,  ఎంపిక చేసిన మోడల్స్‌పై రూ. 3,329 నుండి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMI ఎంపికలతో సహా వివిధ రుణ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త మోడళ్లపై రెడింగ్టన్ రూ. 6,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. ముందస్తు ఆర్డర్‌లు  ఇప్పటికే ప్రారంభం.

అలాగే ఇంగ్రామ్ మైక్రో ఇండియా కూడా 7,000 కంటే ఎక్కువ రిటైల్ ప్రదేశాలలో తాజా ఆపిల్ ఉత్పత్తులను అందిస్తుంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ  బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5,000 క్యాష్‌బ్యాక్ , ఆరు నెలల నో-కాస్ట్ EMI ఎంపికతో సహా ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్‌లు లభ్యం.  అదనంగా, రూ. 6,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్‌ కూడా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top