ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈవో ఎంపిక

Rbl Bank Recommends Candidates for MD and CEO - Sakshi

ఆర్‌బీఎల్‌కు త్వరలో కొత్త ఎండీ 

ఆర్‌బీఐ అనుమతే తరువాయి..  

న్యూఢిల్లీ:  ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈవోను ఎంపిక చేసుకుంది. ఇందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతి కోసం దరఖాస్తు చేసినట్లు తెలియజేసింది. బ్యాంకు రెగ్యులర్‌ కార్యకలాపాల బాధ్యతల నిర్వహణకు నామినేషన్‌ అండ్‌ రెమ్యునరేషన్‌ కమిటీ సిఫారసు చేసిన కొత్త చీఫ్‌కు ఓకే చెప్పినట్లు పేర్కొంది. బుధవారం సమావేశమైన బోర్డు ఇందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలియజేసింది. అయితే కొత్త చీఫ్‌ పేరును వెల్లడించలేదు.

1949 బ్యాంకింగ్‌ నియంత్రణల చట్టం ప్రొవిజన్లమేరకు ఆర్‌బీఐ అనుమతి కోసం చీఫ్‌ ఎంపిక వివరాలను దాఖలు చేసినట్లు వివరించింది. బ్యాంక్‌ మధ్యంతర ఎండీ, సీఈవో రాజీవ్‌ అహుజా బాధ్యతలను మూడు నెలలపాటు పొడిగించేందుకు ఆర్‌బీఐ గత నెలలో అనుమతించిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో కొన్ని అనూహ్య సంఘటనల కారణంగా అప్పటి ఎండీ, సీఈవో విశ్వవీర్‌ అహుజాను బ్యాంక్‌ బోర్డు సెలవుపై పంపింది. 

చదవండి: ఎగుమతిదారులకు  సుంకాలు, జీఎస్‌టీ రిఫండ్స్‌..  రూ.1.75 లక్షల కోట్లు 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top