
ముంబై: భారత్ బ్యాంకింగ్ రుణ వృద్ధి 2022 ఫిబ్రవరి 25తో ముగిసిన ఏడాది కాలంలో 7.9 శాతం పెరిగి రూ.116.27 లక్షల కోట్లకు చేరింది. ఇక ఇదే కాలంలో డిపాజిట్ వృద్ధి రేటు 8.6 శాతం ఎగసి రూ.162.17 లక్షల కోట్లకు ఎగసింది. 2021 ఫిబ్రవరి 26 నాటికి ఈ విలువలు వరుసగా రూ.107.75 లక్షల కోట్లు, రూ.149.33 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఫిబ్రవరి 25 నాటికి షెడ్యూల్డ్ బ్యాంకుల స్టేట్‌మెంట్ ఆఫ్ పొజిషన్ ప్రాతిదికన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 2020 ఏప్రిల్– 2021 మార్చి మధ్య బ్యాంకింగ్ కేవలం 5.56 శాతం రుణ వృద్ధిని నమోదుచేసుకోగా, 11.4 శాతం డిపాజిట్ వృద్ధి నమోదయ్యింది.