RBI-Mantha Urban: ఆర్బీఐ సంచలన నిర్ణయం..! మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు...!

RBI cancels licence of Mantha Urban Cooperative Bank - Sakshi

గత కొన్నిరోజలుగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంకులపై కొరడా ఝలిపిస్తోంది. తాజాగా మరో బ్యాంక్ లెసెన్స్ రద్దు చేసింది. మంతా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.  

కారణం అదే...!
మహారాష్ట్రకు చెందిన మంతా అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితులు బలహీనంగా మారడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.  మంతా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ రద్దు నిర్ణయం ఫిబ్రవరి 16 నుంచి అమలులోకి వస్తుందని ఆర్‌బీఐ తెలిపింది. దీంతో బ్యాంక్ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడానికి వీలు ఉండదు. మహరాష్ట్రలోని కోఆపరేషన్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కమిషన్‌ కూడా ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని ఆర్‌బీఐ సూచించింది.  దాంతో పాటుగా  బ్యాంక్‌కు లిక్విడేటర్‌ను కూడా నియామించాలని ఆర్బీఐ ఆదేశించింది. బ్యాంక్ వద్ద సరిపడినంత మూలధనం లేదని,  ఆదాయ మార్గాలు కూడా కనిపించడం లేదని అందుకే బ్యాంక్ లైసెన్స్ రద్దు చేశామని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.  

ఖాతాదారులకు డబ్బు చెల్లించని స్థితిలో...
మంతా అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ తన వద్ద ఉన్న డబ్బులతో ప్రస్తుతం బ్యాంక్ ఖాతాదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా చెల్లించలేనీ  పరిస్థితిలో ఉందని ఆర్బీఐ తెలిపింది. దీంతో ఖాతాదారులు తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉండనుంది.  ముందు జాగ్రతగా లైసెన్స్ రద్దు చేశామని ఆర్బీఐ పేర్కొంది. 

భరోసా ఇచ్చిన ఆర్బీఐ...!
బ్యాంక్ లైసెన్స్ రద్దు నేపథ్యంలో మంతా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇకపై డిపాజిట్లు స్వీకరణ,చెల్లింపులు చేయకూడదు. కాగా బ్యాంక్ లెసెన్స్ రద్దు నేపథ్యంలో ఖాతాదారులు భయపడాల్సిన పని లేదని ఆర్‌బీఐ భరోసా ఇచ్చింది. బ్యాంక్ ఖాతాలో డబ్బులు కలిగిన వారికి వారి డబ్బులు వెనక్కి వస్తాయని తెలిపింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) కింద రూ. 5 లక్షల వరకు డబ్బులు వెనక్కి పొందవచ్చునని తెలిపింది. ఈ బ్యాంకులో రూ. 5 లక్షల వరకు డబ్బులు దాచుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. బ్యాంకులోని 99 శాతం మందికి వారి డబ్బులు పూర్తిగా వెనక్కి వస్తాయని ఆర్బీఐ పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top