
బ్యాంకులు తమ డిజిటల్ ఛానళ్లపై థర్డ్ పార్టీ (ఇతర సంస్థలకు చెందిన) ఉత్పత్తులను ప్రదర్శించరాదంటూ ఆర్‌బీఐ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ప్రమోటర్ గ్రూప్ సంస్థలు, బ్యాంక్ గ్రూపు సబ్సిడరీలు/జేవీలు/అసోసియేట్‌లకు సైతం ఇది వర్తించనుంది.
రిస్క్ ఆధారిత లావాదేవీల పర్యవేక్షణ, నిఘా యంత్రాంగాన్ని బ్యాంక్‌లు అమల్లోకి తీసుకురావాలని ముసాయిదా నిబంధనల్లో ఆర్‌బీఐ పేర్కొంది. కస్టమర్ల లావాదేవీల తీరును అధ్యయనం చేయడం, అసాధారణ లావాదేవీలను పర్యవేక్షించడం లేదా లావాదేవీలకు సంబంధించి కస్టమర్ల ఆమోదాన్ని ముందస్తుగా పొందడం వంటివి కొత్త రిస్క్ నిర్వహణ విధానం కింద ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ఆగస్ట్ 11 వరకు వీటిపై భాగస్వాముల నుంచి సలహా, సూచనలను ఆహ్వానించింది.