ర్యాలీ షురూ‌- 46,000 ఎగువకు సెన్సెక్స్‌

Rally restarts- Sensex climbs to 46000 points mark - Sakshi

250 పాయిం‍ట్లు ప్లస్‌- 46,210కు సెన్సెక్స్

‌ 74 పాయింట్లు ఎగసి 13,552 వద్ద ట్రేడవుతున్న నిఫ్టీ

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభాల్లోనే

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్ క్యాప్స్‌ 0.5-1 శాతం అప్

ముంబై, సాక్షి: ఒక్క రోజు విరామం తదుపరి తిరిగి దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 250 పాయింట్లు పెరిగి 46,210కు చేరింది. నిఫ్టీ సైతం 74 పాయింట్లు ఎగసి13,552 వద్ద ట్రేడవుతోంది. గత నెలలో ఉద్యోగ ఆఫర్లు పుంజుకోవడం, సహాయక ప్యాకేజీపై తిరిగి పెరిగిన ఆశల నేపథ్యంలో గురువారం యూఎస్‌ మార్కెట్లు కనిష్టాల నుంచి కోలుకుని మిశ్రమంగా ముగిశాయి. ఇటీవల జీడీపీ రికవరీ బాట పట్టడం, వ్యాక్సిన్ల అందుబాటుపై అంచనాలు దేశీయంగా సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 46,247 ఎగువన, నిఫ్టీ 13,562 వద్ద గరిష్టాలకు చేరాయి. (పతన బాటలో యూపీఎల్‌- ఐఆర్‌సీటీసీ )

ఐటీ, ఫార్మా.. 
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ, ఫార్మా నామమాత్రంగా నీరసించగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌ 2.3 శాతం ఎగశాయి. ఈ బాటలో మెటల్‌, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, మీడియా, ఎఫ్‌ఎంసీజీ‌, ఆటో రంగాలు 1 శాతం స్థాయిలో్ పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్‌జీసీ 6.4 శాతం జంప్‌చేయగా, ఐవోసీ, గెయిల్‌, ఎన్‌టీపీసీ, యూపీఎల్‌, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, బీపీసీఎల్‌, టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ఎం 3-1.25 శాతం మధ్య బలపడ్డాయి. అయితే దివీస్‌, అదానీ పోర్ట్స్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, ఐషర్‌, శ్రీసిమెంట్‌, ఏషియన్‌ పెయింట్స్‌ 1-0.3 శాతం మధ్య డీలాపడ్డాయి. (పసిడికి ఉద్యోగ గణాంకాల దెబ్బ)

అపోలో టైర్‌ అప్‌
డెరివేటివ్స్‌లో అపోలో టైర్స్‌, కెనరా బ్యాంక్‌, సెయిల్‌, ఎన్‌ఎండీసీ, నాల్కో, బంధన్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌ 4.5-3 శాతం మధ్య జంప్‌ చేశాయి. కాగా.. మరోపక్క గోద్రెజ్‌ ప్రాపర్టీస్, బెర్జర్‌ పెయింట్స్‌, సన్‌ టీవీ, డీఎల్‌ఎఫ్‌, అపోలో హాస్పిటల్స్‌, పిరమల్‌, టొరంట్‌ ఫార్మా 1-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5-1 శాతం చొప్పున ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,665 క్షీణించగా..1241 లాభాలతో కదులుతున్నాయి.

ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,260 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,275 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకన్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 3,564 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 2,493 కోట్ల విలువైన అమ్మకాలు నిర్వహించాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2,910 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,641 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top