9 రోజుల్లో 1600 కోట్లు సంపాదించాడు..! ఎలాగంటే..!

Rakesh Jhunjhunwala Earn 1600 Crore From This Stock In 9 Days - Sakshi

గత కొద్ది రోజుల నుంచి ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా స్టాక్‌మార్కెట్‌లో భారీ లాభాలను గడిస్తున్నారు. స్టాక్‌మార్కెట్ల నుంచి రాకేష్‌ 9 రోజుల్లో 16 వందల కోట్లను సంపాదించారు.  నజారా టెక్నాలజీస్‌, టైటాన్‌ కంపెనీ, టాటా మోటార్స్‌ షేర్లు భారీగా లాభాలను గడించాయి. గత కొన్ని సెషన్లలో టాటా గ్రూప్ షేర్ల భారీ ర్యాలీ నేపథ్యంలో షేర్‌ హోల్డర్స్‌కు అద్భుతమైన ప్రతిఫలాన్ని అందిచాయి.
చదవండి: ఇక ఫేస్‌బుక్‌లో గోలగోలే...! యూజర్లకు గుడ్‌న్యూస్‌...!

టాటా మోటార్స్ షేర్ ధర 52 వారాల గరిష్టానికి చేరుకుంది.   దాంతో పాటుగా టైటాన్ కంపెనీ షేర్లు  జీవితకాల గరిష్ట స్థాయిని అధిగమించింది. వాస్తవానికి, టైటాన్ కంపెనీ షేర్లు 2021 ప్రారంభం నుండి ఆకాశాన్నంటుతున్నాయి.ఈ నెల నుంచి టైటాన్‌ కంపెనీ షేర్లు మరింత వేగం పుంజుకుంది. 9 ట్రేడ్ సెషన్లలో, టైటాన్ షేర్ ధర దాదాపు 17.50 శాతం పెరగడంతో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా దాదాపు 1600 కోట్లు సంపాదించడంలో సహాయపడింది.

రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా టాటాగ్రూప్‌లో భారీగా పెట్టుబడులను పెట్టారు.  రాకేష్‌ టాటా గ్రూప్‌లో 3 కోట్లకుపైగా షేర్లను కల్గి ఉన్నారు. అతని సతీమణి 96 లక్షలకు పైగా షేర్లను కల్గి ఉన్నారు. 

టైటాన్‌ షేర్లు రయ్‌ రయ్‌...!
టైటాన్‌ షేర్లు కొన్ని రోజుల నుంచి భారీ లాభాలను గడిస్తున్నాయి. ఈ నెలలో గత తొమ్మిది ట్రేడ్ సెషన్లలో, టైటాన్ షేర్ ధర రూ. 2161.85  నుంచి రూ. 2540 పెరిగింది. తొమ్మిది రోజుల్లో టైటాన్‌ షేర్‌ ధర సుమారు రూ.378.15 మేర పెరిగాయి.  ప్రస్తుతం టైటాన్‌ షేర్లు 2547.60 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.
చదవండి: ఆకాశమే హద్దు! 61 వేలు క్రాస్‌ చేసిన సెన్సెక్స్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top