17 రూపాయిల‌తో 116 కిలోమీట‌ర్ల ప్రయాణం

Pure EV Launches High Speed epluto 7G Electric Scooter - Sakshi

దేశవ్యాప్తంగా ఎల‌క్ట్రిక్ వాహానాల మీద రోజు రోజుకి ప్రజలకు ఆసక్తి పెరుగుతుంది. ప్రస్తుతం పెరుగుతున్న చమురు ధ‌ర‌లు ఇందుకు ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఇప్ప‌టికే చాలా ఎల‌క్ట్రిక్ కంపెనీలు మార్కెట్లో అందుబాటులో ఉన్న అవి ఇంకా సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలు స్పీడ్ తక్కువగా వెళ్లడం లేదా ధర ఎక్కువగా ఉండటం చేత సామాన్య ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే, వీటిన్నంటిని దృష్టిలో పెట్టుకొని సామాన్యుల‌కు అందుబాటులో ఉండేలా ఎల‌క్ట్రిక్ స్కూటర్లను హైదరాబాద్ కు చెందిన ప్యూర్ ఈవీ అనే స్టార్టప్ సంస్థ తయారు చేస్తుంది‌. ప్యూర్ ఈవీ అనే సంస్థ హై స్పీడ్ మోటార్ స్కూటర్లను అందుబాటు ధరలో తయారు చేస్తుంది. 

ఈ సంస్థకు చెందిన "ఇప్లూటో 7 జీ" అనే హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 116 కీలోమీట‌ర్ల వ‌ర‌కు దీనిపై ప్ర‌యాణం చేయోచ్చ‌ని సంస్థ ప్ర‌తినిధులు పేర్కొన్నారు. దీని మరో ప్రత్యేకత ఏమిటంటే ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రూ.17 విలువ చేసే ప‌వ‌ర్ ఖ‌ర్చు కానున్నట్లు సంస్థ ప్ర‌తినిధులు పేర్కొన్నారు. అంటే కేవ‌లం 17 రూపాయిల‌తోనే సుమారు 116 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయవచ్చు అన్నమాట‌. అలాగే, ఈ స్కూటర్ కేవ‌లం 5 సెక‌న్లు లోనే దాదాపు 40 కీలోమీట‌ర్ల స్పీడ్ ను అందుకుంటుంది. ఇప్లూటో 7 జీ గరిష్ట వేగం 60 కిలోమీట‌ర్లు. ఇది 2.5 కేడ్ల్యూహెచ్ లిథియోమ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. దీనిని ఫుల్ చార్జ్ చేయ‌డానికి నాలుగు గంట‌ల సమయం ప‌డుతుంది. ఇప్లూటో 7 జీ ఎక్స్ షోరూమ్ ధర రూ.83,999 గా కంపెనీ నిర్ణ‌యించింది. ఐదేళ్ల వారంటీతో పాటు వ‌చ్చే ఈ బైక్ తీసుకోవ‌డానికి ప‌లు బ్యాంక్ లు లోన్ కూడా అందిస్తున్నాయి.

చదవండి:

గూగుల్ మీట్ ఫ్రీ వీడియో కాల్స్ గడువు పొడిగింపు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top