టయోటా లగ్జరీ కారు సొంతం చేసుకున్న ఫస్ట్‌ సెలబ్రిటీ: ధర తెలిస్తే!

Punjabi singer gurdas maan buys new toyota land cruiser lc300 - Sakshi

సాక్షి, ముంబై: ఖరీదైన వాహనాలను కొనాలని అందరికి ఉంటుంది. కానీ అది చాలా వరకు పారిశ్రామిక వేత్తలకు, సెలబ్రటీలకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇటీవల పంజాబీ సింగర్ 'గురుదాస్ మాన్' టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC300 సొంతం చేసుకున్నారు.

ఇటీవల జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన ల్యాండ్ క్రూయిజర్ ఎల్‌సి300 ధర రూ. 2.1 కోట్లు. ఇది వైట్ పెర్ల్, సూపర్ వైట్, డార్క్ రెడ్ మైకా మెటాలిక్, ఆల్టిట్యూడ్ బ్లాక్, డార్క్ బ్లూ మైకా కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. ఇందులో గురుదాస్ మాన్ ఆల్టిట్యూడ్ బ్లాక్ కలర్ కారుని డెలివరీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పటికే కంపెనీ ల్యాండ్ క్రూయిజర్ ఎల్‌సి300 కోసం రూ. 10 లక్షల టోకెన్‌తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే మొత్తం అమ్ముడైపోవడం గమనార్హం. ఇది 3.3-లీటర్, టర్బోచార్జ్డ్, V6 డీజిల్ ఇంజిన్‌ కలిగి 309 పిఎస్ పవర్ & 700 ఎన్ఎమ్ టార్క్ అందిస్తూ 10 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే, ల్యాండ్ క్రూయిజర్ LC300లో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్, 14-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ సీట్లు, సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి.

గురుదాస్ మాన్ పంజాబ్‌కు చెందిన సింగర్, రచయిత కూడా. ఇతడు 1980లో దిల్ దా మామ్లా హై అనే పాటతో ఒక్కసారిగా పేమస్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు తన పాటలతో అందరినీ ఆకట్టుకుంటూ 2013 లో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. ల్యాండ్ క్రూయిజర్ డెలివరీ సమయంలో కూడా పంజాబీ పాటతో అలరించాడు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top