breaking news
land cruiser
-
900 పైగా ల్యాండ్ క్రూయిజర్లు రీకాల్..
టొయోటా కిర్లోస్కర్ మోటర్ సంస్థ తన ప్రముఖ లగ్జరీ ఎస్యూవీ టొయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 (Toyota Land Cruiser 300)కు సంబంధించి 969 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2024 సెప్టెంబర్ 4 నుంచి 2025 సెప్టెంబర్ 30 మధ్య తయారైన వాహనాలు ఈ రీకాల్ పరిధిలోకి వస్తాయి.ట్రాన్స్మిషన్ సాఫ్ట్వేర్ లోపమే కారణంకంపెనీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ట్రాన్స్మిషన్ పనితీరును నియంత్రించే ట్రాన్స్మిషన్ కంట్రోల్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో సంభావ్య లోపం గుర్తించారు. ట్రాన్స్‌మిషన్‌లో గేర్ మార్పులను నిర్వహించేందుకు లీనియర్ సోలెనాయిడ్లు ఉపయోగిస్తారు. కొన్ని నిర్దిష్ట డ్రైవింగ్ పరిస్థితుల్లో ఈ సోలెనాయిడ్ సరిగా పనిచేయకపోతే, సాఫ్ట్వేర్ లోపం వల్ల ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్, ఇంజిన్ ఈసీయూ మధ్య కమ్యూనికేషన్ లోపం ఏర్పడే అవకాశం ఉంది.ఈ లోపం సరిచేయకపోతే కొన్ని గేర్లలో ట్రాన్స్మిషన్ ఓవర్-రివింగ్‌కు దారితీసే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో ఇది ట్రాన్స్మిషన్కు నష్టం కలిగించడమే కాకుండా, అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు పవర్ లాస్ సమస్యను కూడా కలిగించవచ్చు. ట్రాన్స్మిషన్ హౌసింగ్ దెబ్బతింటే ఫ్లూయిడ్ లీకేజ్ సంభవించి, చివరికి ట్రాన్స్మిషన్ వైఫల్యానికి దారితీసే ప్రమాదం ఉందని సంస్థ స్పష్టం చేసింది. అయితే భారత్‌లో ఇప్పటివరకు ఇలాంటి సంఘటనలు నమోదు కాలేదని తెలిపింది.లెక్సస్ ఎల్‌ఎక్స్‌లోనూ ఇదే యూనిట్గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇదే 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్‌ను లెక్సస్ ఎల్ఎక్స్ మోడల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఆ మోడల్‌కు సంబంధించి కూడా ఇలాంటి సమస్యల పరిష్కారానికి రీకాల్ జారీ చేసినట్లు కంపెనీ పేర్కొంది.రీకాల్‌లో భాగమైన అన్ని వాహన యజమానులను టొయోటా డీలర్ ప్రతినిధులు వ్యక్తిగతంగా సంప్రదిస్తారు. అవసరమైన సాఫ్ట్వేర్ అప్డేట్ లేదా సరిదిద్దే చర్యలు ఉచితంగా చేపడతామని కంపెనీ వెల్లడించింది. కస్టమర్లు తమకు ఏవైనా సందేహాలు ఉంటే సమీప డీలర్‌ను లేదా కస్టమర్ అసిస్టెన్స్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించింది.భారత్‌లో టొయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.15 కోట్లు. ఇందులో 3.3-లీటర్ వి6 టర్బో డీజిల్ ఇంజిన్‌తో కూడిన 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 304 బీహెచ్పీ పవర్, 700 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. -
భూటాన్ కార్ల స్మగ్లింగ్ కలకలం.. ఎంబసీ కారుగా నమ్మించి..
కొచ్చి: కేరళలోని కొచ్చిలో భూటాన్ కార్ల స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. భూటాన్ నుండి అక్రమంగా భారత్‌కు తరలించిన టయోటా ల్యాండ్ క్రూయిజర్ కారును.. భారత రాయబార కార్యాలయం (Indian Embassy) వాహనంగా నమ్మించి, విక్రయించిన ఘటనపై కొచ్చి పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీకి చెందిన రోహిత్ బేడీ అనే వ్యక్తి ఎడపల్లి(కేరళ)కి చెందిన మహమ్మద్ యాహ్యాను నమ్మించి, కారు విక్రయానికి రూ. 14 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు.విలాసవంతమైన కార్లను తక్కువ ధరకే విక్రయించడానికి మోసగాళ్లు వాటిని ‘ఎంబసీ వెహికల్’గా చెబుతుంటారు. దీనిని నమ్మిన బాధితుడు, దఫదఫాలుగా నగదు రూపంలోనూ, బ్యాంక్ బదిలీల ద్వారా కారు కొనుగోలుకు మొత్తం సొమ్మును చెల్లించాడు. గత ఏడాది అక్టోబర్‌లో కస్టమ్స్ విభాగం చేపట్టిన ‘ఆపరేషన్ నుంఖోర్’లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ కలిగిన ఈ ల్యాండ్ క్రూయిజర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భూటాన్ నుండి అక్రమ మార్గాల్లో దిగుమతి చేసుకుని, నకిలీ పత్రాలతో భారత్‌లో రిజిస్ట్రేషన్ చేయించిన వాహనాలను అరికట్టేందుకు ఈ ఆపరేషన్ ప్రారంభమైంది.తాను కొనుగోలు చేసిన కారు ఎంబసీ వాహనం కాదని, అక్రమంగా స్మగ్లింగ్ చేసినదని గుర్తించిన బాధితుడు యాహ్యా, తనను మోసం చేసిన బ్రోకర్‌పై ఎర్నాకులం సెంట్రల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో దీని వెనుక భారీ నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భూటాన్‌లో పన్నులు తక్కువగా ఉన్న కారణంగా, అక్కడి నుంచి కార్లను దిగుమతి చేయడం లేదా పాత కార్లను కొనుగోలు చేసి భారత్‌కు తరలించడం లాంటి పనులను ముఠా సభ్యులు చేస్తుంటారు. అలాగే భారీ దిగుమతి సుంకాలను తప్పించుకునేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేదా భారత సైన్యానికి చెందిన నకిలీ ఎన్ఓసీలను సృష్టిస్తారు. తరువాత హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసి, కేరళ తదితర దక్షిణాది రాష్ట్రాల్లోని కొనుగోలుదారులకు భారీ ధరలకు ఆ కార్లను విక్రయిస్తుంటారు.బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడు రోహిత్ బేడీపై ఐపిసి సెక్షన్ 406 (నమ్మక ద్రోహం), 420 (చీటింగ్) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ అనూప్ సి నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కొనుగోలుకు సంబంధించిన పత్రాలను, బ్యాంక్ లావాదేవీల వివరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ స్మగ్లింగ్ రాకెట్లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ -
టయోటా లగ్జరీ కారు సొంతం చేసుకున్న ఫస్ట్ సెలబ్రిటీ: ధర తెలిస్తే!
సాక్షి, ముంబై: ఖరీదైన వాహనాలను కొనాలని అందరికి ఉంటుంది. కానీ అది చాలా వరకు పారిశ్రామిక వేత్తలకు, సెలబ్రటీలకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇటీవల పంజాబీ సింగర్ 'గురుదాస్ మాన్' టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC300 సొంతం చేసుకున్నారు. ఇటీవల జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన ల్యాండ్ క్రూయిజర్ ఎల్సి300 ధర రూ. 2.1 కోట్లు. ఇది వైట్ పెర్ల్, సూపర్ వైట్, డార్క్ రెడ్ మైకా మెటాలిక్, ఆల్టిట్యూడ్ బ్లాక్, డార్క్ బ్లూ మైకా కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. ఇందులో గురుదాస్ మాన్ ఆల్టిట్యూడ్ బ్లాక్ కలర్ కారుని డెలివరీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే కంపెనీ ల్యాండ్ క్రూయిజర్ ఎల్సి300 కోసం రూ. 10 లక్షల టోకెన్‌తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే మొత్తం అమ్ముడైపోవడం గమనార్హం. ఇది 3.3-లీటర్, టర్బోచార్జ్డ్, V6 డీజిల్ ఇంజిన్ కలిగి 309 పిఎస్ పవర్ & 700 ఎన్ఎమ్ టార్క్ అందిస్తూ 10 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఫీచర్స్ విషయానికి వస్తే, ల్యాండ్ క్రూయిజర్ LC300లో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్, 14-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ సీట్లు, సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. గురుదాస్ మాన్ పంజాబ్‌కు చెందిన సింగర్, రచయిత కూడా. ఇతడు 1980లో దిల్ దా మామ్లా హై అనే పాటతో ఒక్కసారిగా పేమస్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు తన పాటలతో అందరినీ ఆకట్టుకుంటూ 2013 లో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. ల్యాండ్ క్రూయిజర్ డెలివరీ సమయంలో కూడా పంజాబీ పాటతో అలరించాడు. -
సీఎం కోసం రూ.80 కోట్లతో కొత్త వాహనాలు
చంఢీగర్ : పంజాబ్ ప్రభుత్వం దాదాపు 80 కోట్ల రూపాయలు వెచ్చించి 400 లక్జరి కార్లను కొంటున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి, అతని మంత్రి వర్గం, అధికారుల కోసం ఈ లక్జరి కార్లను కొంటున్నట్లు సమాచారం. ఇప్పటికే 16 ల్యాండ్ క్రూయిజర్ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ 16 వాహనాల్లో రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా ఉన్నాయి. వీటిని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ కోసం వినియోగించనున్నట్లు సమాచారం. అలానే ముఖ్యమంత్రి అధికారుల కోసం 13 మహీంద్ర స్కార్పియో వాహనాలను, స్పెషల్ డ్యూటీ అధికారుల కోసం 14 హోండా మారుతీ కార్లను కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌కు, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్‌లకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఇచ్చేందుకు అమరేందర్ సింగ్ ప్రభుత్వం నిరాకరించింది. అంతేకాక మాజీ ముఖ్యమంత్రి, అకాలీదళ్ అధ్యక్షులు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలనే వాడుతున్నారని.. అవి మంచి స్థితిలోనే ఉన్నాయని పంజాబ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ వెల్లడించారు. ఈ కొత్త వాహనాల కొనుగోలు వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 80 కోట్ల అదనపు భారం పడుతున్నట్లు ఆర్థిక శాఖ అంచనా వేసింది. 2018, మార్చి నాటికే ప్రభుత్వ ఖజానా రు. 1,95,978 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నట్లు తెలిసింది. -
రెండేళ్ల తర్వాత కారు తిరిగిచ్చేస్తా...
నిరాణి అందజేసిన లగ్జరీ కార్‌పై యడ్యూరప్ప వ్యాఖ్య బెంగళూరు: మాజీ మంత్రి మురుగేష్ నిరాణి తనకు అందజేసిన రూ.1.16 కోట్ల విలువైన లగ్జరీ కారును రెండేళ్ల తర్వాత ఆయనకే తిరిగి ఇచ్చేస్తానని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్ప వెల్లడించారు. శనివారమిక్కడి డాలర్స్ కాలనీలో ఉన్న తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరాణి తనకు బహుమానంగా ఇచ్చిన కారును కరువు ప్రాంతాల పర్యటన పూర్తి చేయడంతో పాటు రెండేళ్ల తర్వాత తిరిగి ఇచ్చేస్తానని తెలిపారు. కరువు పర్యటన సమయంలో ఈ కారును కేవలం జిల్లా కేంద్రాల వరకు మాత్రమే పరిమితం చేస్తానని, గ్రామాలకు వేరే వాహనంలో వెళతానని యడ్యూరప్ప తెలిపారు. కారు ఖరీదును రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులతో పోల్చి వివాదాస్పదం చేయడం సరికాదని అన్నారు. ఈనెల 29 నుంచి తాను కరువు పర్యటనను ప్రారంభించనున్నానని వెల్లడించారు. ఇక ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేపట్టిన కరువు పర్యటనపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలకు భయపడి కరువు పర్యటనను సీఎం సిద్ధరామయ్య చేపట్టారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల కంటే మంత్రి వర్గ విస్తరణపైనే ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తోందని మండిపడ్డారు. -
పాక్ క్రికెట్ కెప్టెన్ కారు సీజ్
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు అత్యధిక కాలం కెప్టెన్ గా కొనసాగుతున్న మిస్బా-వుల్-హక్ ను కష్టాలు వెంటాడుతున్నాయి. అతడి కారుని అధికారులు సీజ్ చేశారు. కస్టమ్స్ డ్యూటీ, పన్నులు చెల్లించకపోవడంతో మిస్బాకు చెందిన ల్యాండ్ క్రూయిజర్ కారును ఫెడరల్ బోర్డు ఆఫ్ రెవెన్యూ అండ్ టాక్సేషన్(ఎఫ్ బీఆర్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెనాల్టీతో సహా పన్నులు చెల్లించిన తర్వాతే కారు తిరిగిస్తామని అధికారులు నోటీసు ఇచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు రూ.40 లక్షలు పన్ను బకాయిలు కట్టనందుకు అతడి బ్యాంకు ఖాతాను గతేడాది ఎఫ్ బీఆర్ అధికారులు నిలిపివేశారు. తర్వాత ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ను కలిసి ఈ సమస్యను మిస్బా పరిష్కరించుకున్నాడు. శ్రీలంకతో జరగనున్న మూడు టెస్టుల కోసం మిస్బా సిద్ధమవుతున్నాడు.


