PM launch 5G services: 5జీ సేవలను ప్రారంభించిన ప్రధాని

Prime Minister Narendra Modi Launch 5G Services Oct 1 In India - Sakshi

న్యూఢిల్లీ: దేశ టెలికాం రంగంలో కొత్త శకం మొదలైంది. దేశంలో 5జీ సేవలు (5G Services) ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా (అక్టోబర్‌ 1న) లాంఛనంగా ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అక్టోబర్‌ 1 నుంచి 4 తేదీల మధ్య జరిగే 6వ ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌–2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని.. దీంతో పాటు 5జీ సేవలకు శ్రీకారం చుట్టారు. 


ఈ సేవల సామర్థ్యానికి సంబంధించిన డెమోను రిలయన్స్‌ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ.. ప్రధానికి వివరించారు. ఆ తర్వాత 5జీ సేవల పనితీరును మోదీ స్వయంగా పరిశీలించారు. రిలయన్స్‌ జియో అహ్మదాబాద్‌ సమీపంలోని ఓ గ్రామంలో, భారతీ ఎయిర్‌టెల్‌ వారణాసిలో 5జీ సేవలను ప్రారంభిస్తాయి.

ప్రధాని ఈ సందర్భంగా గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌తోపాటు ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో 5జీ టెక్నాలజీ ఆధారంగా కనెక్ట్‌ కాబోతున్నారు.  వొడాఫోన్‌ ఐడియా సైతం 5జీ సేవలను ప్రారంభించనుంది. కాగా, దీపావళి నాటికి నాలుగు మెట్రో నగరాల్లో 5జీ సేవలను పరిచయం చేస్తామని జియో ఇప్పటికే ప్రకటించింది.

నెల రోజుల్లో 5జీ సేవలను ప్రారంభిస్తామని ఎయిర్‌టెల్‌ సీఈవో గోపాల్‌ విఠల్‌ కూడా వెల్లడించారు.  ముందుగా 5జీ సేవలను 13 నగరాలకు అందించనున్నారు. ఈ జాబితాలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, చండీగఢ్, గురుగ్రామ్, హైదరాబాద్, లక్నో, పూణే, గాంధీనగర్, అహ్మదాబాద్, జామ్‌నగర్.

చదవండి: Natural Gas Prices Hike: భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top