Oppo: సొంత దుకాణానికి సిద్ధమైన ఒప్పో...! వారికి మాత్రం పెద్ద దెబ్బే..!

Oppo May Be Developing Own Chipset For Flagship Phones - Sakshi

స్మార్ట్‌ఫోన్‌ కంపెనీల్లో చిప్‌సెట్‌ మంటలను రాజేసింది. ఎవరికీవారు తమ చిప్‌సెట్లను తామే తయారుచేసుకోవడానికి పలు స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు సిద్దమైయ్యాయి. చిప్‌సెట్ల తయారీ విషయంలో గూగుల్‌, క్వాల్‌కమ్‌ మధ్య విభేదాలు మొదలైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా మరో స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఒప్పో కూడా తమ సొంత చిప్‌ సెట్ల తయారీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సొంత చిప్‌సెట్లను తయారుచేసే ఆపిల్‌, శాంసంగ్‌, గూగుల్‌ కంపెనీల సరసన ఒప్పో చేరనుంది. 
చదవండి: అదృష్టం అంటే వీళ్లదే..! పెట్టుబడి రూ.లక్ష..సంపాదన కోటి రూపాయలు

క్వాలకమ్‌కు పెద్ద దెబ్బే...!
ఒప్పో తీసుకున్న నిర్ణయంతో ప్రముఖ మొబైల్‌  చిప్‌ తయారీ దిగ్గజం క్వాలకమ్‌కు భారీ దెబ్బ తగలనుంది. ఒప్పో స్వంత చిప్‌సెట్లతో క్వాలకమ్‌ భారీ ఎత్తున నష్టపోనుంది ఒప్పో తన హై-ఎండ్ చిప్‌లను 2023 లేదా 2024 లో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు జపాన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ నిక్కీ నివేదించింది. ప్రపంచంలో నాల్గో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌గా ఒప్పో నిలిచింది. వివో, రియల్‌మీ , వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు ఒప్పో మాతృ సంస్థగా నిలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్లలో క్వాల్కమ్‌, మీడియాటెక్‌ చిప్‌సెట్‌లను వాడుతున్నారు. కాగా హై ఎండ్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్ల తయారీలో కంపెనీ తన స్వంత చిప్‌సెట్లను వాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సొంత చిప్‌ సెట్‌లతో పలు స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు...!
ప్రపంచంలోని అన్ని ప్రధాన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఇప్పుడు వేగవంతమైన కస్టమ్ చిప్‌ను అభివృద్ధి చేసే రేసులో ఉన్నాయి. పలు స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు చిప్‌సెట్‌ తయారీ కంపెనీలకు గడ్డుకాలంగా తయారైంది. గూగుల్‌ ఇప్పటికే పిక్సెల్‌ 6 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లలో క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ చిప్‌లకు బదులుగా గూగుల్‌ తన సొంత టెన్నార్‌ చిప్‌ సెట్లను అమర్చింది.  ఆపిల్ ఇప్పటికే ఐఫోన్, ఐప్యాడ్ కోసం తన స్వంత A- సిరీస్ చిప్‌సెట్‌లను తయారు చేస్తుంది. శాంసంగ్‌ తన ఎక్సినోస్‌ చిప్‌సెట్‌తో గెలాక్సీ ఫోన్లను, టాబ్లెట్లకు అందిస్తున్నాయి. హువావే కూడా  దాని స్వంత హైసిలికాన్ చిప్‌సెట్‌లను తయారు చేస్తోంది.  
చదవండి: సరికొత్త హంగులతో టయోటా ఇన్నోవా..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top