
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఎఫ్ 31 సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఎఫ్ 31, ఎఫ్ 31 ప్రో, ఎఫ్ 31 ప్రో ప్లస్ అనే మూడు మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లన్నీ 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తాయి. అన్నింటిలోనూ ఏఐ ఆధారిత ఫీచర్లు చాలానే ఇచ్చారు. వాటి స్పెసిఫికేషన్‌లు ఏంటి.. ధరలు ఎంత.. ఎక్కడ కొనుక్కోవాలి.. తదితర వివరాలను ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం.
ఒప్పో ఎఫ్31 5జీ సిరీస్ ధరలు, లభ్యత
ఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 5జీ
8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.34,999. హిమాలయన్ వైట్, జెమ్‌స్టోన్ బ్లూ, ఫెస్టివల్ పింక్ రంగుల్లో లభ్యమవుతుంది.
ఒప్పో ఎఫ్31 ప్రో 5జీ
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.26,999. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.28,999. అదే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.30,999. డెసెర్ట్ గోల్డ్, స్పేస్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది.
ఒప్పో ఎఫ్31 5జీ
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.22,999. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.24,999. క్లౌడ్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లూ, బ్లూమ్ రెడ్ రంగుల్లో లభ్యమవుతుంది.
ఒప్పో ఎఫ్31 ప్రో, ఎఫ్31 ప్రో ప్లస్ స్టార్ట్‌ఫోన్‌లు సెప్టెంబర్ 19 నుంచి ఒప్పో ఈ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. మరోవైపు ఒప్పో ఎఫ్ 31 5జీ మాత్రం సెప్టెంబర్ 27 నుంచి అందుబాటులోకి రానుంది.
ఆఫర్లు
ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్రా బ్యాంకుల ఎంపిక చేసిన కార్డులను ఉపయోగించుకుంటే 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 10 శాతం వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ వినియోగించుకోవచ్చు. ప్రమాదవశాత్తు డ్యామేజీ అయితే 180 రోజుల ఉచిత కేర్ ఉంటుంది. ఇవి కాక ఆరు నెలల వరకు వడ్డీ లేని ఈఎంఐ ప్లాన్ లు, మొదటి రోజు ప్రీ-బుక్ లేదా కొనుగోలు చేసే కస్టమర్లు ఎంపిక చేసిన కార్డులు లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ లపై బ్యాంక్ డిస్కౌంట్ వంటివి ఉంటాయి.
స్పెసిఫికేషన్లు
మూడు మోడళలోనూ కొన్ని ఒకే రకమైన స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ప్రో ప్లస్ 6.8-అంగుళాల డిస్‌ప్లే, మిగిలిన రెండు 6.5-అంగుళాల స్క్రీన్లను కలిగి ఉన్నాయి. అన్నింటికీ 120 హెడ్జ్ రీఫ్రెష్ రేటు ఉంటుంది. ప్రతి ఫోన్‌లోనూ 80వాట్ల సూపర్‌వోక్ ఫాస్ట్ ఛార్జింగ్ తో 7,000ఎంఏహెచ్ బ్యాటరీ, రివర్స్ అండ్ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అన్ని ఫోన్‌లూ క్వాల్‌కామ్ స్నాప్‌గ్రాడన్ 7 జెన్ 3 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15పై పనిచేస్తాయి. ఇక కీలకమైన కెమెరా విషయానికి వస్తే ఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 5జీ, ఒప్పో ఎఫ్31 ప్రో 5జీ ఫోన్‌లకు ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఇవ్వగా ఒప్పో ఎఫ్31 5జీ ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. రియర్ కెమెరా మాత్రం అన్ని ఫోన్‌లకూ ఒకేలా 50ఎంపీ + 2ఎంపీ ఇచ్చారు.
ఇదీ చదవండి: ఒప్పో కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల.. భారీ బ్యాటరీతో ప్రత్యేక ఫీచర్లు