లీకైన వన్ ప్లస్ నార్డ్ 2 కెమెరా, డిస్ప్లే ఫీచర్లు

OnePlus Nord 2 Renders Surface, Triple Rear Camera Setup - Sakshi

కొద్ది రోజుల క్రితమే వన్ ప్లస్ నార్డ్ సీఈ విడుదల అయ్యిందో లేదో అప్పుడే వన్ ప్లస్ నార్డ్ 2కి సంబంధించిన పుకార్లు బయటకి వస్తున్నాయి. గత ఏడాది విడుదల చేసిన వన్ ప్లస్ నార్డ్ కి కొనసాగింపుగా దీనిని తీసుకొస్తున్నారు. వన్ ప్లస్ నార్డ్ 2 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, హోల్-పంచ్ డిస్ ప్లేతో వస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఈ స్మార్ట్ ఫోన్ కీలక స్పెసిఫికేషన్ లను వెల్లడించిన టిప్ స్టార్ స్టీవ్ హెమ్మర్ స్టాఫర్ అకా @OnLeaks సోమవారం మరికొన్ని వివరాలను షేర్ చేశారు. ఏఐ బెంచ్ మార్క్ వెబ్ సైట్ లో లిస్టింగ్ ద్వారా స్మార్ట్ ఫోన్ ఎస్ వోసిపై సమాచారం లీక్ అయిన వెంటనే ఈ వార్త వచ్చింది. 

ఈ ఫోన్ జూలైలో మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ప్రాసెసర్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 6.43 అంగుళాల ఫుల్ హెచ్ డి + అమోల్డ్ డిస్ ప్లేతో వస్తున్నట్లు సమాచారం. ట్విట్టర్ లో హెమ్మర్స్ఆఫర్(అకా ఆన్ లీక్స్) షేర్ చేసిన వివరాల ప్రకారం.. వన్ ప్లస్ నార్డ్ 2 డిస్ప్లే పై ఎడమ మూలలో సెల్ఫీ స్నాపర్ హోల్-పంచ్ కటౌట్ ను కలిగి ఉంటుంది. ఇందులో వాల్యూమ్ రాకర్ ఎడమ అంచున ఉంది, కుడి అంచులో పవర్ బటన్, అలర్ట్ స్లైడర్ ఉంది. వన్ ప్లస్ నార్డ్ 2లో ట్రిపుల్ కెమెరా సెటప్, ఎడమ మూలలో దీర్ఘచతురస్రాకార మాడ్యూల్ లో ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తుంది. ఇంకా యుఎస్ బి టైప్-సీ పోర్ట్, సీమ్ ట్రే, దిగువన స్పీకర్ గ్రిల్ ఉన్నాయి. ఏఐ బెంచ్ మార్క్ లిస్టింగ్ ప్రకారం స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్ తో వస్తుందని తెలుస్తుంది. 

చదవండి: ల్యాప్‌టాప్‌ కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top