భారత్‌కు ఉబర్‌ గుడ్‌బై.. స్పందించిన సీఈవో | Ola Ceo Bhavish Aggarwal Denied The Report And Hinted That Uber Might Exit India | Sakshi
Sakshi News home page

భారత్‌కు ఉబర్‌ గుడ్‌బై, స్పందించిన సీఈవో

Aug 1 2022 7:11 PM | Updated on Aug 1 2022 8:20 PM

Ola Ceo Bhavish Aggarwal Denied The Report And Hinted That Uber Might Exit India - Sakshi

ప్రముఖ రైడ్‌ షేరింగ్‌ సంస్థ ఓలా, ఉబర్‌లు మెర్జ్‌ అవుతున్నాయా?ఊబర్‌ ఇండియాలో తన కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజాగా వెలుగులోకి వచ్చిన నివేదికలు.

పలు నివేదికల ప్రకారం.. ఓలా- ఉబర్‌లు మెర్జ్‌ అవుతున్నాయని, ఇందులో భాగంగా ఓలా సీఈవో భవీష్‌ అగర్వాల్‌..అమెరికా శాన్‌ ఫ్రాన్సిస్కోలో ఉబర్‌కు చెందిన టాప్‌ ఎగ్జిక్యూటీవ్‌లతో మంతనాలు జరిపారని నివేదికల సారాంశం. అయితే ఆ వార్తల్ని భవిష్‌ అగర్వాల్‌ కొట్టి పారేశారు. "అబ్సిల్యూట్ రబిష్" ఓలా లాభాల్ని గడిస్తుంది. అదే సమయంలో వృద్ధి సాధిస్తుంది. కావాలనుకుంటే విదేశీ కంపెనీలు దేశం నుంచి నిష్క్రమించాలనుకుంటే వారికి స్వాగతం! మెర్జ్‌ అయ్యే అవకాశం లేదని ఖండించారు. 

భారత్‌ నుంచి బెర్‌ అవుట్‌ 
మరో రైడ్‌ షేరింగ్‌ సంస్థ ఉబర్‌ భారత్‌లో తన కార్యకలాల్ని నిలిపివేస్తున్నట్లు బ్లూం బెర్గ్‌ తన కథనంలో పేర్కొంది. ఈ కథంపై ఉబర్‌ సీఈవో డార ఖోస్రోషి స్పందించారు. భారత్‌లో రైడ్‌ షేరింగ్‌ మార్కెట్‌ ఎలా ఉందో మాకు బాగా తెలుసు. భారత్‌ నుంచి మేం వెళ్లి పోవడం లేదని, కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నట్లు బ్లూం బెర్గ్‌కు ఇప్పటికే చెప్పామని అన్నారు. 

బ్లూం బెర్గ్‌ ఏం రాసిందంటే 
ఈ ఏడాది జూన్‌లో ఓలా, ఉబెర్‌ల గురించి బ్లూం బెర్గ్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. పెరిగిపోతున్న ధరల కారణంగా ఆ సంస్థలు అభివృద్ధితో పాటు లాభాల్ని గడించడంలో  ఇబ్బందులు పడుతున్నాయని హైలెట్‌ చేసింది. అందుకే భారత్‌ మార్కెట్‌ నుంచి ఉబర్‌ నిష్క్రమించవచ్చని సూచించింది. అయితే భవిష్యత్తులో ఉబెర్‌ భారత్‌లో కార్యకలాపాల్ని కొనసాగించేందుకు దేశీయంగా మరో రైడ్‌ షేరింగ్‌ సంస్థతో జతకట్టవచ్చని వెల్లడించింది. అందుకు ఉబర్‌ చైనాలో దీదీ గ్లోబల్‌తో, ఆగ్నేయాసియాలో గ్రాబ్ హోల్డింగ్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల్ని ఉదహరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement