నైకా సీఎఫ్‌వో అరవింద్‌ రాజీనామా

Nykaa Company Cfo Arvind Agarwal Resign His Post - Sakshi

న్యూఢిల్లీ: నైకా బ్రాండ్‌ కింద కార్యకలాపాలు సాగిస్తున్న ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఈ–కామర్స్‌ వెంచర్స్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌వో) అరవింద్‌ అగర్వాల్‌ రాజీనామా చేశారు. డిజిటల్‌ ఎకానమీ, స్టార్టప్‌ విభాగంలో అవకాశాలపై దృష్టి పెట్టేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

కొత్త సీఎఫ్‌వో నియామకం ప్రక్రియపై కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది. 2020 జూలైలో అగర్వాల్‌ అమెజాన్‌ నుండి నైకాలో చేరారు. కంపెనీ ఐపీవోను పర్యవేక్షించిన కీలక సిబ్బందిలో (కేఎంపీ) ఆయన కూడా ఒకరు.  

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top