ఐఫోన్‌ను తలదన్నేలా బెస్ట్‌ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌..! నథింగ్‌ నుంచి..! లాంచ్‌ ఎప్పుడంటే..?

Nothing Phone 1 Nothing OS and the Other Things Carl Pei Announced - Sakshi

వన్‌ప్లస్‌ కో ఫౌండర్‌ కార్ల్ పీ నథింగ్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ సంస్థను నెలకొల్పిన విషయం తెలిసిందే. నథింగ్‌ ఇయర్‌ బడ్స్‌ను లాంచ్‌ చేసి ఆడియో గాడ్జెట్స్‌ సెగ్మెంట్స్‌లో సంచలనం సృష్టించాడు. ఇప్పుడు ఏకంగా యాపిల్‌ ఐఫోన్లకు ప్రత్యామ్నాయంగా స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్‌ చేసేందుకు నథింగ్‌ సిద్ధమైంది. 

నథింగ్‌​ ఫోన్‌ 1
నథింగ్ బ్రాండ్ నుంచి తొలి స్మార్ట్‌ఫోన్‌ నథింగ్ ఫోన్‌ 1 ( Nothing Phone 1 ) పేరుతో రానుంది. ఈ విషయాన్ని వన్‌ప్లస్‌ మాజీ సీఈవో, ప్రస్తుతం నథింగ్‌ సంస్థ హెడ్ కార్ల్ పీ (Carl Pei) వెల్లడించారు.  బుధవారం వర్చువల్‌గా జరిగిన నథింగ్ ఈవెంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించారు. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో రానుంది. స్టాక్ ఆండ్రాయిడ్‌ ఎక్స్‌పీరియన్స్‌కు అతి దగ్గరగా ఉండే నథింగ్ ఓఎస్‌ తో అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను బెస్ట్ ఆఫ్ ప్యూర్ ఆండ్రాయిడ్‌గా సంస్థ పేర్కొంది.

లాంచ్ ఎప్పుడంటే..?
నథింగ్ ఫోన్‌ 1 మొబైల్‌ను ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు గ్లోబల్‌గా లాంచ్ అయిన సమయంలోనే నథింగ్ ఫోన్‌ 1 భారత్‌లో కూడా లాంచ్‌ కానుంది. 

యాపిల్ ఐఫోన్లకు ప్రత్యామ్నాయంగా..!
నథింగ్‌ ఫోన్‌ 1 యాపిల్‌ను ఐఫోన్లను టార్గెట్‌ చేసింది. యాపిల్‌కు ప్రత్యామ్నాయంగా గట్టి పోటీని ఇస్తూ ఎదగడమే తమ లక్ష్యమని కార్ల్ పీ చెప్పారు.స్టాక్ ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌లో బెస్ట్ ఫీచర్లను నథింగ్ ఓఎస్‌లో వాడుతామని కార్ల్ చెప్పారు.  అలాగే మూడు సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు రానున్నాయి. అంతేకాకుండా ట్రాన్స్‌ప్రంట్ డిజైన్‌తో వస్తోందని తెలిపారు. స్మార్ట్‌ఫోన్ల తయారీలో భాగంగా అమెరికన్‌ చిప్‌ మేకర్‌ క్వాల్‌కమ్‌తో నథింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నథింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 30 వేల కంటే తక్కువగా ఉండనుంది.

చదవండి: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్‌ ఛార్జింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన రియల్‌మీ..! ధర ఎంతంటే..?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top