‘ది హెల్తీ స్టేట్స్, ప్రోగ్రెసివ్‌ ఇండియా’ ర్యాంకింగ్స్‌

NITI Aayog to release 4th edition of states health index on Dec 27 - Sakshi

27న విడుదల చేయనున్న నీతి ఆయోగ్‌

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆరోగ్య రంగంలో మెరుగుదల దిశగా ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ర్యాంకింగ్స్‌ను నీతి ఆయోగ్‌ ఈనెల 27న విడుదల చేయనుంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ‘ది హెల్తీ స్టేట్స్, ప్రోగ్రెసివ్‌ ఇండియా’ పేరుతో రాష్ట్రాల ఆరోగ్యరంగ పనితీరుపై ఈ ర్యాంకింగ్స్‌ను సిద్ధం చేశారు. 2017లో నీతి ఆయోగ్, కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రపంచ బ్యాంకు సహకారంతో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆరోగ్యం రంగం పనితీరు, ఆరోగ్య రంగ పురోభివృద్ధిని పెంపొందించేందుకు వార్షిక ఆరోగ్య సూచికను ప్రారంభించింది. దీని ద్వారా రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచడంతోపాటు, పరస్పరం అనుభవాలను పంచుకునేందుకు ప్రోత్సహిస్తారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top