కొత్త కారు కొనే వారికి బంపర్ ఆఫర్!

Nissan Kicks attracts offers up to Rs 95,000 in March 2021 - Sakshi

కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీ కోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ఏప్రిల్ నుంచి ధరలు పెరగనున్న నేపథ్యంలో జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ తన కిక్స్ ఎస్‌యూవీ మోడళ్లపై అదిరిపోయే ఆఫర్లు అందిస్తోంది. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్స్ వంటివి ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా ఉద్యోగులు ప్రత్యేక బెనిఫిట్ పొందొచ్చు. దీనికి తోడు నిస్సాన్ ఇండియా అన్ని ప్రభుత్వ / పిఎస్‌బి / పిఎస్‌యు ఉద్యోగుల కోసం ఎల్‌టిసి ఆఫర్‌ను కూడా అందిస్తుంది. 

కంపెనీ పేర్కొన్న వివరాల ప్రకారం నిస్సాన్ కిక్స్ మోడల్‌పై మొత్తంగా రూ.95 వేల వరకు తగ్గింపు అందిస్తుంది. క్యాష్ డిస్కౌంట్ రూపంలో రూ.25 వేల తగ్గింపు ఉంటే ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.50 వేలు తగ్గింపు పొందవచ్చు. అలాగే లాయల్టీ బోనస్ కింద మరో రూ.20 వేలు డిస్కౌంట్ ఉంది. కంపెనీ ఆథరైజ్డ్ డీలర్‌షిప్స్ వద్ద మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కొత్తగా కారు కొనే వారి దగ్గరిలోని షోరూమ్‌కు వెళ్లి ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇకపోతే నిస్సాన్ కిక్స్ కారు 8 వేరియంట్ల రూపంలో అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన వేరియంట్లకే ఆఫర్ వర్తిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి కారు ధరలు పెరగనున్న నేపథ్యంలో ఇది ఒక బంపర్ అఫర్ అని చెప్పుకోవాలి.

చదవండి:

ఈ అమెజాన్ లింకుతో జర జాగ్రత్త!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top