భారీ నష్టాలు: సెన్సెక్స్‌ 650 పాయింట్లు పతనం | Nifty and Sensex trading down | Sakshi
Sakshi News home page

భారీ నష్టాలు: సెన్సెక్స్‌ 650 పాయింట్లు పతనం

Aug 19 2022 2:39 PM | Updated on Aug 19 2022 6:12 PM

Nifty and Sensex trading down - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్ భారీగా నష్టపోయింది.  మధ్యాహ్నం సెషన్‌లో అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో  ఒకదశలో సెన్సెక్స్‌ ఏకంగా700 పాయింట్లు కుప్ప కూలింది. చేరింది. చివరికి సెన్సెక్స్‌ 651 పాయింట్ల నష్టంతో 59646 వద్ద, నిఫ్టీ 198 పాయింట్లు కుప్పకూలి 17758 వద్ద ముగిసింది.  అలాగే తాజా నష్టాలతో సెన్సెక్స్‌ 60వేల దిగువకు, నిఫ్టీ కూడా 17800  దిగువకు పడిపోయింది. ప్రధానంగా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ షేర్లు,నష్టపోగా ఐటీ జోరు కొనసాగింది.


ఇండస్‌ఇండ్ బ్యాంక్ 2.58 శాతం,బజాజ్ ఫిన్‌సర్వ్ 2.50 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.77 శాతం నష్టపోయింది. అలాగే  ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్,  ఎన్‌టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ సెన్సెక్స్ నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

ఐటీ జోరు
నష్టాల మార్కెట్లో ఐటీ షేర్లు మాత్రం కొనుగోళ్లు కనిపించాయి. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు టాప్‌ గెయినర్లుగా నిలిచాయి.  మరోవైపు డాలరుమారకరంలో రూపాయి 14 పాయింట్లు నష్టంతో 79.78 వద్ద  ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement