smart phones: స్క్రీన్‌ లేని స్మార్ట్‌ఫోన్‌,నెక్ట్స్‌ జనరేషన్‌ ఫోన్లన్నీ ఇలానే ఉంటాయ్‌?

next of kin creative Spar One Emergency Cell Phone Runs Single AA Battery  - Sakshi

స్క్రీన్‌లెస్‌ సెల్‌ఫోనా? స్క్రీన్‌లేని సెల్‌ఫోన్‌ను ఏం చేసుకుంటారు? ఏడ్చినట్లే ఉంటుందనుకుంటున్నారా? ఫొటోలో కనిపిస్తున్న ఈ సెల్‌ఫోన్‌కు బొత్తిగా స్క్రీన్‌ లేకపోవడమేమీ కాదుగాని, స్క్రీన్‌ మీద కేవలం బ్యాటరీ మాత్రమే కనిపిస్తుంది. నంబర్లు, పేర్లు వగైరా సమాచారమేమీ కనిపించదు. 

ఇది పాకెట్‌ ట్రాన్సిస్టర్లు, క్యాలికులేటర్లు వంటి వాటిలో వాడే ‘ఏఏ’ సైజ్‌ బ్యాటరీతో పనిచేస్తుంది.

సింగపూర్‌లోని టెక్‌ కన్సల్టెన్సీ సంస్థ ‘నెక్ట్స్‌ ఆఫ్‌ కిన్‌ క్రియేటివ్స్‌’ రూపొందించిన ఈ స్క్రీన్‌లెస్‌ సెల్‌ఫోన్‌కు ‘స్పేర్‌వన్‌ ఫోన్‌’ అని పేరు పెట్టారు.

అత్యవసర పరిస్థితుల్లో ఇది భేషుగ్గా ఉపయోగపడుతుందని దీని తయారీదారులు చెబుతున్నారు.

ఫోన్‌ నంబర్లను సేవ్‌ చేసుకునేందుకు మెమొరీ, బేసిక్‌ సెల్‌ఫోన్‌ మాదిరి బటన్‌ కీబోర్డ్‌తో పాటు రాత్రివేళల్లో ఉపయోగపడేలా శక్తిమంతమైన ఎల్‌ఈడీ టార్చ్‌లైట్‌ మాత్రమే దీనిలో ఉండే ప్రత్యేక సౌకర్యాలు. 

చదవండి: రేసిజం ఎఫెక్ట్‌..వరల్డ్‌ ఫేమస్‌ టిక్‌ టాకర్‌కు షాక్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top