భారీ ఇంజిన్‌తో ఖరీదైన బైక్

The new Triumph motorcycle has a truly monstrous engine - Sakshi

అతిపెద్ద ఇంజిన్‌తో ట్రయంఫ్ రాకెట్ 3 జీటీ  బైక్ 

ధర 18.4 లక్షల రూపాయలు

సాక్షి, న్యూఢిల్లీ:  యూకేకు చెందిన మోటార్‌సైకిల్‌ తయారీ దిగ్గజం ట్రయంఫ్ రాకెట్ 3 బ్రాండ్  లో అత్యంత ఖరీదైన కొత్త మెటార్ బైక్ లాంచ్ చేసింది.  భారీ ఇంజిన్‌తో  రాకెట్ 3 జీటీ  పేరుతో దీన్ని భారతదేశంలో విడుదల చేసింది. దీని ధర  రూ .18.4 లక్షలుగా నిర్ణయించింది.  కరోనా  సంక్షోభం కాలంలో అమ్మకాలు లేక  దేశం నుంచి వైదొలగాలని మరో దిగ్గజ సంస్థ హార్లే డేవిడ్సన్ భావిస్తున్న  తరుణంలో  ట్రయంఫ్ అద్భుత ఫీచర్లతో ఈ కొత్త మోటార్  సైకిల్  తీసుకువడం విశేషం. 

రాకెట్ 3 జీటీ స్పెసిఫికేషన్లు

  • ట్రిపుల్ మెటారు ప్రధాన ఆకర్షణ. అతిపెద్ద 2,500 సీసీ ఇన్ లైన్ 3-సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజిన్  6000 ఆర్ పీఎమ్ వద్ద 167 బిహెచ్‌పి శక్తిని,  4,000 ఆర్పిఎమ్ వద్ద 221 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది గత వెర్షన్ కంటే  11 శాతం ఎక్కువ. 
  • కొత్త క్రాంక్కేస్ అసెంబ్లీ, ఇంటిగ్రల్ ఆయిల్ ట్యాంక్‌, బ్యాలెన్సర్ షాఫ్ట్ కలిగి ఉంది. ఇంజిన్ బరువును 18 కిలోలకు పరిమితం చేసింది. పాత తరం బైక్‌తో పోలిస్తే బరువును సుమారు 40 కిలోలు తగ్గించింది.
  • టూరింగ్ స్టయిల్ హ్యాండిల్‌బార్‌, పొడవైన విండ్‌స్క్రీన్,  గో ప్రో కంట్రెల్స్ తో బ్లూటూత్-ఎనేబుల్డ్ ఫుల్-కలర్ టిఎఫ్‌టి డాష్, హిల్-హోల్డ్ కంట్రోల్, 4 రైడ్ మోడ్స్, కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి.  ఇంకా టార్క్ అసిస్టెడ్ క్లచ్, ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్,  ఎక్స్‌టెండెడ్ ఫ్లై స్క్రీన్, అడ్జస్టబుల్ ఫుట్‌పెగ్, తేలికపాటి 20-స్పోక్ అల్యూమినియం వీల్ లాంటి ఇతర ఫీచర్లు ఈ బైక్ సొంతం. 


తమ కొత్త ట్రయంఫ్ రాకెట్ 3 జీటీ ఔత్సాహికుల బైక్ అని ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా బిజినెస్ హెడ్ షుయెబ్ ఫారూక్ తెలిపారు. అత్యుత్తమ టెక్నాలజీ, ఎర్గోనామిక్స్, ఆశ్చర్యపరిచే పనితీరుతో ఇదొక లెజెండ్ బైక్ అన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top