రూ. 400 కోట్ల సమీకరణలో ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ | Muthoot Fincorp in raising Rs 400 crore | Sakshi
Sakshi News home page

రూ. 400 కోట్ల సమీకరణలో ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌

Sep 5 2023 7:41 AM | Updated on Sep 5 2023 7:41 AM

Muthoot Fincorp in raising Rs 400 crore - Sakshi

హైదరాబాద్‌: ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ సంస్థ నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల (ఎన్‌సీడీ) ద్వారా రూ. 400 కోట్ల వరకు సమీకరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రూ. 300 కోట్ల వరకు గ్రీన్‌ షూ ఆప్షన్‌ కింద అట్టే పెట్టుకునే వెసులుబాటుతో రూ. 100 కోట్ల ఎన్‌సీడీలను జారీ చేసినట్లు సంస్థ తెలిపింది. 

రూ. 1,000 ముఖ విలువ ఉండే ఎన్‌సీడీలు సెప్టెంబర్‌ 14 వరకు అందుబాటులో ఉంటాయి. 24 నెలల నుంచి 96 నెలల వరకు కాలావధి ఉండే ఈ వీటిపై రాబడి రేటు 8.65 శాతం – 9.43 శాతం దాకా ఉంటుందని కంపెనీ సీఈవో షాజీ వర్గీస్‌ తెలిపారు. రూ. 1,100 కోట్ల వరకు గరిష్ట సమీకరణ పరిమితికి లోబడి తొలి విడతగా ఈ ఎన్‌సీడీలను జారీ చేస్తున్నట్లు ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement