రైలు మిస్ అయితే.. సేమ్ టిక్కెట్టుతో ఇంకో రైలు ఎక్కొచ్చా? | Missed Your Train? Here’s What Indian Railways Rules Say About Your Ticket | Sakshi
Sakshi News home page

రైలు మిస్ అయితే.. సేమ్ టిక్కెట్టుతో ఇంకో రైలు ఎక్కొచ్చా?

Apr 25 2026 3:31 PM | Updated on Apr 25 2026 3:44 PM

Missed Your Train? Here’s What Indian Railways Rules Say About Your Ticket

ప్రయాణికులు ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఒక్కోసారి ట్రాఫిక్ జాంలు లేదా ఇతర అనివార్య కారణాల వల్ల రైలు మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రయాణీకుల్లో ఒకటే ఆందోళన.. "నేను కొన్న టిక్కెట్టు ఏమవుతుంది..? దీనితో మరో రైలులో ప్రయాణించవచ్చా?" అని ఆందోళన కలుగుతుంది. అయితే, దీనిపై ఇండియన్ రైల్వేస్‌కు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం..

ఒకవేళ మీరు తీసుకున్నది జనరల్ టిక్కెట్టు అయితే, రైలు మిస్ అయినా అదే టిక్కెట్టుతో నెక్స్ట్ అందుబాటులో ఉన్న రైలులో ప్రయాణించే వీలుంటుంది. కానీ, ఇక్కడ ఒక షరతు ఉంది. సాధారణంగా జనరల్ టిక్కెట్లు కొనుగోలు చేసిన సమయం నుంచి 3 గంటలు లేదా ఆ మార్గంలో వెళ్లే మొదటి రైలు వచ్చే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఆ సమయం దాటితే ఆ టిక్కెట్టు చెల్లదు.

ఒకవేళ రిజర్వేషన్ టిక్కెట్టు ఉంటే కుదరదు..
ఒకవేళ మీరు స్లీపర్, ఏసీ లేదా ఏదైనా కేటగిరీలో ముందస్తుగా బెర్త్ రిజర్వ్ చేసుకుని, ఆ రైలును మిస్ అయితే మాత్రం అదే టిక్కెట్టుతో మరో రైలు ఎక్కడానికి వీల్లేదు. మరో టిక్కెట్టు తప్పనిసర..తదుపరి రైలులో వెళ్లాలంటే మీరు కొత్తగా టిక్కెట్టు తీసుకోవాల్సిందే. రీఫండ్ అవ్వదు..రైలు మిస్ అయిన సందర్భంలో రిజర్వేషన్ టిక్కెట్టుపై రీఫండ్ పొందే హక్కు ప్రయాణీకుడికి ఉండదు.

కేటగిరీ మారినా.. 
మీ దగ్గర ఉన్నది ఆర్డినరీ రైలు టిక్కెట్టు అయి ఉండి, మీరు మెయిల్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ లేదా రాజధాని, శతాబ్ది, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణించాలనుకుంటే ఆ టిక్కెట్టు చెల్లదు. ఆయా రైళ్ల కేటగిరీని బట్టి మీరు అదనపు రుసుము చెల్లించి కొత్త టిక్కెట్టు తీసుకోవాలి.టీటీఈ చెకింగ్‌లో దొరికితే జరిమానా!..చెల్లని టిక్కెట్టుతో లేదా పాత రిజర్వేషన్ టిక్కెట్టుతో మరో రైలులో ప్రయాణిస్తూ టీటీఈ కి దొరికితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఒకవేళ జరిమానా చెల్లించడానికి నిరాకరిస్తే, రైల్వే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడా పడవచ్చని రైల్వే నిబంధనలు హెచ్చరిస్తున్నాయి.కాబట్టి, రైలు ప్రయాణానికి కనీసం గంట ముందే స్టేషన్‌కు చేరుకోవడం ఉత్తమం. ఒకవేళ పొరపాటున రైలు మిస్ అయితే, రిస్క్ తీసుకోకుండా నిబంధనల ప్రకారం కొత్త టిక్కెట్టు తీసుకోవడమే బెటర్.. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement