breaking news
train miss
-
రైలు మిస్ అయితే.. సేమ్ టిక్కెట్టుతో ఇంకో రైలు ఎక్కొచ్చా?
ప్రయాణికులు ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఒక్కోసారి ట్రాఫిక్ జాంలు లేదా ఇతర అనివార్య కారణాల వల్ల రైలు మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రయాణీకుల్లో ఒకటే ఆందోళన.. "నేను కొన్న టిక్కెట్టు ఏమవుతుంది..? దీనితో మరో రైలులో ప్రయాణించవచ్చా?" అని ఆందోళన కలుగుతుంది. అయితే, దీనిపై ఇండియన్ రైల్వేస్‌కు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం..ఒకవేళ మీరు తీసుకున్నది జనరల్ టిక్కెట్టు అయితే, రైలు మిస్ అయినా అదే టిక్కెట్టుతో నెక్స్ట్ అందుబాటులో ఉన్న రైలులో ప్రయాణించే వీలుంటుంది. కానీ, ఇక్కడ ఒక షరతు ఉంది. సాధారణంగా జనరల్ టిక్కెట్లు కొనుగోలు చేసిన సమయం నుంచి 3 గంటలు లేదా ఆ మార్గంలో వెళ్లే మొదటి రైలు వచ్చే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఆ సమయం దాటితే ఆ టిక్కెట్టు చెల్లదు.ఒకవేళ రిజర్వేషన్ టిక్కెట్టు ఉంటే కుదరదు..ఒకవేళ మీరు స్లీపర్, ఏసీ లేదా ఏదైనా కేటగిరీలో ముందస్తుగా బెర్త్ రిజర్వ్ చేసుకుని, ఆ రైలును మిస్ అయితే మాత్రం అదే టిక్కెట్టుతో మరో రైలు ఎక్కడానికి వీల్లేదు. మరో టిక్కెట్టు తప్పనిసర..తదుపరి రైలులో వెళ్లాలంటే మీరు కొత్తగా టిక్కెట్టు తీసుకోవాల్సిందే. రీఫండ్ అవ్వదు..రైలు మిస్ అయిన సందర్భంలో రిజర్వేషన్ టిక్కెట్టుపై రీఫండ్ పొందే హక్కు ప్రయాణీకుడికి ఉండదు.కేటగిరీ మారినా.. మీ దగ్గర ఉన్నది ఆర్డినరీ రైలు టిక్కెట్టు అయి ఉండి, మీరు మెయిల్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ లేదా రాజధాని, శతాబ్ది, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణించాలనుకుంటే ఆ టిక్కెట్టు చెల్లదు. ఆయా రైళ్ల కేటగిరీని బట్టి మీరు అదనపు రుసుము చెల్లించి కొత్త టిక్కెట్టు తీసుకోవాలి.టీటీఈ చెకింగ్‌లో దొరికితే జరిమానా!..చెల్లని టిక్కెట్టుతో లేదా పాత రిజర్వేషన్ టిక్కెట్టుతో మరో రైలులో ప్రయాణిస్తూ టీటీఈ కి దొరికితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.ఒకవేళ జరిమానా చెల్లించడానికి నిరాకరిస్తే, రైల్వే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడా పడవచ్చని రైల్వే నిబంధనలు హెచ్చరిస్తున్నాయి.కాబట్టి, రైలు ప్రయాణానికి కనీసం గంట ముందే స్టేషన్‌కు చేరుకోవడం ఉత్తమం. ఒకవేళ పొరపాటున రైలు మిస్ అయితే, రిస్క్ తీసుకోకుండా నిబంధనల ప్రకారం కొత్త టిక్కెట్టు తీసుకోవడమే బెటర్.. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. -
రాజధానికి రైలు కరువు
–తాడిపత్రిలో ఆగని ప్రధాన రైళ్లు –ఏళ్ల తరబడి ప్రతిపాదనలు బుట్టదాఖలు –ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు తాడిపత్రి : జిల్లాలోనే కాదు..రాష్ట్రంలోనే గ్రానైట్, నల్లబండల పరిశ్రమలకు కేరాఫ్‌గా ఉన్న తాడిపత్రి నుంచి రాజధాని అమరావతికి రైలు కరువైంది. దీనివల్ల వ్యాపారులు, ప్రజలు అవస్థ పడుతున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతం నుంచి గుంటూరుకు గానీ, విజయవాడకు గానీ రైలు సౌకర్యమే లేదు. కర్నూలు, వైఎస్సార్ జిల్లాలకు సరిహద్దుగా కూడా ఉన్న తాడిపత్రి నుంచి ప్రతి రోజూ వందలాది మంది విజయవాడకు వెళుతుంటారు. అయితే.. తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి నేరుగా రైలు సౌకర్యం లేదు. అనంతపురం, గుత్తి, గుంతకల్లులో ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి.. అక్కడి నుంచి ప్రయాణించాల్సిందే. పట్టణ జనాభా 1.08 లక్షలు. ఎనిమిది మండలాలకు కేంద్రబిందువుగా ఉంది. రెండు ఉక్కు, మూడు సిమెంట్, 600 నల్లబండల, 250 గ్రానైట్ పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 30వేల మంది కార్మికులు పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. వీరు వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతున్నారు. ముంబాయి– చెన్నై ప్రధాన రైల్వే మార్గంలో ఉన్న తాడిపత్రి రైల్వే సేషన్ నుంచి ప్రతి రోజు 1,500 మందికిపైగా ప్రయాణిస్తుంటారు. మొత్తం 18 రైళ్లు ప్రతి రోజు ఈ స్టేషన్ గుండా వెళుతున్నాయి. మరో 18 రైళ్లు వారానికి ఒకసారి, వారంలో రెండు, మూడు రోజులు వెళ్తుంటాయి. ఎనిమిది రైళ్లు ఇక్కడ ఆగకుండానే వెళ్తుండడంతో ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోంది. ఇక్కడ ముఖ్యమైన రైళ్లను ఆపాలని రోటరీ, లయన్స్ క్లబ్, ప్రజా సంఘాల నేతలు చాలాసార్లు అధికారులకు వినతి పత్రాలు అందజేసినా ప్రయోజనం లేదు. ప్రతిపాదనలు ఉన్నా... ముఖ్యమైన రైళ్లు తాడిపత్రి రైల్వేస్టేషన్లో ఆపాలని ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనలు ఉన్నప్పటికీ రైల్వే శాఖ ఆమోదం తెలపలేదు. ఇందులో ప్రధానంగా మధురై–లోకమాన్యతిలక్, లోకమాన్యతిలక్–మధురై, ఒఖా–రామేశ్వరం, రామేశ్వరం–ఒఖా, మంగళూరు–సికింద్రాబాద్, సికింద్రాబాద్–మంగళూరు రైళ్లు ఆపాలని కోరుతున్నారు. ప్రతిపాదనలు పంపించాం–నౌషాద్, స్టేషన్ మేనేజర్, తాడిపత్రి రైల్వేస్టేషన్ తాడిపత్రి రైల్వేస్టేషన్లో నాలుగు ప్రధాన రైళ్లు ఆపాలని ప్రతిపాదనలు పంపించాం. కానీ ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. రాజధాని అమరావతికి కూడా రైలు డిమాండ్ ఉంది. రాజధానికి రైలుతో పాటు ముఖ్యమైన నాలుగు రైళ్లు ఆగితే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. ధర్మవరం–బెజవాడ రైలు తాడిపత్రి గుండా నడపాలి–రజాక్, తాడిపత్రి విజయవాడ, గుంటూరుకు వెళ్లాలంటే చాలా ఇబ్బదిగా ఉంది. గుంతకల్లు, అనంతపురం, గుత్తిలో ఏదో ఒకచోటకు వెళ్లి అక్కడి నుంచి వెళ్లాల్సి వస్తోంది. ధర్మవరం–బెజవాడ రైలును నంద్యాల, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి మీదుగా మళ్లిస్తే బాగుంటుంది.


