ఉద్యోగులకు షాకిచ్చిన మైక్రోసాఫ్ట్‌  

Microsoft cuts 1800 jobs in restructuring will hire more: Report - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజంమైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు షాకిచ్చింది. దాదాపు 1800మందిని ఉద్యోగాలనుంచి తొలగించింది. జూన్‌ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబందించి  మొత్తం  లక్షా  80వేల మంది ఉద్యోగుల్లో దాదాపు ఒక శాతం మందిపై వేటు వేసింది. అయితే తరువాతి  కాలంలో మైక్రోసాఫ్ట్  పునర్నిర్మాణంలో భాగంగా మరింతమందిని  నియమించుకోనుందట. 

కన్సల్టింగ్, కస్టమర్, పార్టనర్ సొల్యూషన్‌ సహా పలు గ్రూపులలో ఈ తొలగింపులు చేసింది. మైక్రోసాఫ్ట్ సాధారణంగా కొత్త ఆర్థిక ఏడాదికి మార్పుల్లో  భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాలో జూలై 4 సెలవులు తరువాత తాజా ఉద్యోగ కోతలను ప్రకటించింది. అయితే చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉద్యోగులను తొలగించామని మైక్రోసాఫ్ట్ వివరించింది. అయితే అన్ని కంపెనీల మాదిరిగానే వ్యాపారాన్ని రివ్యూ చేసుకొని తదనుగుణంగా సర్దుబాట్లు చేసుకుంటామని వెల్లడించింది.  అలాగే పెట్టుబడుల విస్తరణ కొనసాగుతుందని, ఫలితంగా మళ్లీ ఉద్యోగుల సంఖ్యను  పెంచుకుంటామని  మైక్రోసాఫ్ట్  తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top