అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన న్యూ ఏజ్ బాలెనో కారు..!

Maruti Suzuki Launches New Age Baleno With New Tech Features - Sakshi

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ నేడు(ఫిబ్రవరి 23) తన సరికొత్త ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బాలెనో కారును విడుదల చేసింది. ఈ కారును "న్యూ ఏజ్ బాలెనో" అని పిలుస్తారు. ఈ కొత్త బాలెనో కారు ధర సుమారు రూ.6.35 లక్షల నుంచి రూ.9.49 లక్షల(ఎక్స్ షోరూమ్, ఇండియా) వరకు ఉంది. ఈ కొత్త కారు బుకింగ్స్ ఇప్పటికే ఫిబ్రవరి 7, 2022 నుంచి ఓపెన్ అయ్యాయి. మారుతీ సుజుకీ 2022 బాలెనో లాంఛ్ కావడం కన్నా ముందే 25,000 బుకింగ్స్ రావడం విశేషం. 

మారుతి సుజుకి కూడా సబ్ స్క్రిప్షన్ కింద ఈ కొత్త కారును అద్దెకు అందిస్తోంది. దీని సబ్ స్క్రిప్షన్ ధర నెలకు రూ.13,999. సరికొత్త బాలెనోను తయారుచేసేందుకు కంపెనీ రూ.1,150 కోట్లు పెట్టుబడిపెట్టినట్లు చేసింది. ఈ కొత్త బాలెనో హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్, విడబ్ల్యు పోలో, హోండా జాజ్ వంటి వాటితో పోటీ పడనుంది. మారుతి సుజుకి 2022లో 7 కొత్త ఫేస్ లిఫ్ట్ మోడల్స్ ప్రారంభించాలని యోచిస్తోంది. అందులో మొదటిది ఈ కొత్త 2022 బాలెనో కారు. 

2022 బాలెనో ఫీచర్స్
బాలెనో మోడల్లో అత్యున్నతమైన ఇన్-కార్ టెక్నాలజీ, ఎక్స్‌ప్రెసివ్ ఫీచర్లతో వచ్చింది. అల్టిమేట్ అర్బన్ క్రూజింగ్ ఎక్స్​పీరియన్స్​ కోసం క్లాస్ లీడింగ్ సేఫ్టీ ఫీచర్​ను కూడా ఇందులో ఉంది. మారుతీ సుజుకీ 2022 బాలెనో ఐదు రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్, యాంటీ హిల్ కంట్రోల్, ఇతర సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. 2022 బాలెనో ఫ్రంట్ గ్రిల్ వెడల్పుగా ఉంటుంది. సుజుకీ లోగో, డీఆర్ఎల్ టెయిల్ ల్యాంప్స్, అలాయ్ వీల్స్ ఉంటాయి. 

హెడ్ అప్ డిస్‌ప్లే 360 డిగ్రీ వ్యూ కెమెరా, అడ్వాన్స్‌డ్ వాయిస్ అసిస్ట్, ARKAMYS రూపొందించిన సరౌండ్ సెన్స్‌తో 9 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అలెక్సా వాయిస్‌తో సుజుకీ కనెక్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 2022 మారుతి సుజుకి బాలెనోలో 1.2-లీటర్ డ్యూయల్ జెట్ కె12ఎన్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 6,000 ఆర్పిఎమ్ వద్ద 90 హెచ్పి పవర్, 4,400 ఆర్పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు గేర్ బాక్సులు, 5స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా లభిస్తాయి. మారుతి సుజుకి న్యూ ఏజ్ లీటర్‌కు 22.35 కి.మీ/లీ(మాన్యువల్), 22.94 కి.మీ/లీ(ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్) మైలేజ్ ఇవ్వనుంది.

(చదవండి: పెండింగ్ చలాన్ వాహనదారులకు భారీ శుభవార్త..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top