భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు: ఫార్మా ఢమాల్‌!

Market closes higher IT financials shine pharma drags - Sakshi

తిరిగి 60వేల ఎగువకు సెన్సెక్స్‌ 

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  భారీ లాభాలతో ముగిసాయి. ఒక వారం బలహీనత తర్వాత, బెంచ్‌మార్క్ సూచీలు ఏప్రిల్ 24న  పాజిటివ్‌గా ముగిసాయి.  ముఖ్యంగా ప్రైవేట్‌ బ్యాంకుల మెరుగైన ఫలితాలతో దలాల్ స్ట్రీట్‌లో లాభాల కళకనిపించింది. సెన్సెక్స్ 401యింట్లు పెరిగి 60,056 వద్ద, నిఫ్టీ 119  పాయింట్లు లాభంతో 17,743 వద్ద క్లోజ్‌ అయ్యాయి.  తద్వారా సెన్సెక్స్‌ మళ్లీ 60వేల ఎగువకు, నిఫ్టీ 17700 స్థాయిని అధిగమించడం విశేషం. 

బ్యాంకింగ్‌, ఐటీ రంగ షేర్ల లాభపడగా, ఫార్మ రంగ షేర్లు నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, టాటా కన్జ్యూమర్‌,  విపప్రో, టైటన్‌, ఐసీఐసీఐ బ్యాంకు భారీగా లాభపడగా,  సిప్లా, డా.రెడ్డీస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, దివీస్‌, మారుతి సుజుకి నష్టపోయాయి. ​హెచ్‌డీఎఫ్‌సీ వాటాలుపెంపునకు ఆర్‌బిఐ అనుమతించడంతో హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఏడు శాతం పెరిగింది. అలాగూ మెరుగైన ఫలితాలతో టాటాకాన్స్‌, షేర్ల  బై బ్యాక్‌  ప్లాన్‌ నేపథ్యంలో విపప్రో షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి.మరోవైపు సన్‌ఫార్మా మొహాలి యూనిట్‌కు సంబంధించిన యూఎస్‌ఎఫ్‌డీలే  ఆందోళనతో భారీ నష్టపోయింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top