బుకింగ్‌లో మహీంద్రా ఎక్స్‌యువి 700 ఎస్‌యూ‌వి సరికొత్త రికార్డు

Mahindra XUV700 SUV receives 25000 bookings in under an hour - Sakshi

ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ మహీంద్రా తన ఎక్స్‌యువి700 ఎస్‌యూ‌వి కారు బుకింగ్స్ తెరిచిన కేవలం గంట లోపు 25,000 మంది బుకింగ్ చేసినట్లు కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో ఇది ఒక సరికొత్త రికార్డు అని కంపెనీ పేర్కొంది. మహీంద్రా ఎక్స్‌యువి700 పరిచయ ఆఫర్ కింద తక్కువ ధరలతో లాంఛ్ చేశారు. మొదటి 25,000 బుకింగ్స్ కు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఇప్పుడు ఎంట్రీ వేరియంట్ ఎక్స్‌యువి700 ధరలు ₹12.49 లక్షల నుంచి ప్రారంభం కానున్నాయి. బేస్ వేరియంట్ ధరలను కంపెనీ ₹50,000 వరకు పెంచింది. 

బుకింగ్స్ మళ్లీ అక్టోబర్ 8న ఉదయం 10 నుంచి తిరిగి తెరవనున్నారు. కస్టమర్లు డీలర్ షిప్ లేదా డిజిటల్ ఫ్లాట్ ఫారాల ద్వారా ఎక్స్‌యువి 700ని బుక్ చేసుకోవచ్చు, మహీంద్రా ఈ రోజు మొదటిసారి బుకింగ్స్ ప్రారంభించింది. కంపెనీ 25,000 మంది కారు బుక్ చేసుకున్న తర్వాత ధరలను పెంచింది. అన్ని వేరియెంట్ల ధరలను పెంచలేదు. కొన్ని వేరియెంట్ల ధరలను మాత్రమే పెంచింది. ఇది పెట్రోల్,  డీజిల్ ఆప్షన్లతో లభిస్తోంది. డీజిల్ వెర్షన్‌లోని 2.2-లీటర్ ఇంజన్ గరిష్ఠంగా 185 పీఎస్‌ శక్తిని, 450 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్ఠంగా 200 పీఎస్‌ శక్తిని, 380 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు ఆప్షనల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లేదా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.(చదవండి: ఫేస్‌బుక్‌ ద్వారా డబ్బుల్ని ఇలా సంపాదించండి)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top