కుంభకోణం బయటపడే ఏడాది ముందే రామలింగరాజును కలిశా : ఆనంద్‌ మహీంద్రా

Mahindra Group Had Toyed With Merging With Satyam Computer Services, Said Anand Mahindra  - Sakshi

ముంబై: సత్యం కంప్యూటర్స్‌ సంక్షోభం బైటపడటానికి ఏడాది ముందే అందులో తమ ఐటీ సంస్థ టెక్‌ ఎంను విలీనం చేద్దామనుకున్నట్లు మహీంద్రా గ్రూ ప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా వెల్లడించారు. ఇందుకు సంబంధించి అప్పట్లో సత్యం చైర్మన్‌ రామలింగరాజుకు ప్రతిపాదన కూడా చేసినట్లు తెలిపారు. కానీ ఆయన నుంచి తనకు ఎలాంటి సమాధానం రాలేదని మహీంద్రా తెలిపారు. బహుశా కంపెనీ ఖాతాల్లో లొసుగులు ఉండటమే ఇందుకు కారణమై ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

2009 లో సత్యం కంప్యూటర్స్‌ను టెక్‌ మహీంద్రా టేకోవర్‌ చేసే క్రమంలో 100 రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న పరిణామాలపై పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆనంద్‌ మహీంద్రా 

ఈ విషయాలు తెలిపారు. హైదరాబాద్‌లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) ఏర్పాటైనప్పుడు రామలింగ రాజుతో పరిచయం ఏర్పడిందని మ హీంద్రా చెప్పారు. అప్పట్లో టెక్‌ ఎం, సత్యం వ్యా పారాల మధ్య సారూప్యతలు ఉండేవని తెలిపారు. అందుకే టెక్‌ ఎంను సత్యంలో విలీనం చేసే ఉద్దేశంతో రాజుకు ఆఫర్‌ ఇచ్చినట్లు మహీంద్రా పేర్కొన్నారు. 2009లో రూ. 5,000 కోట్ల స్కాము బైటపడిన తర్వాత సత్యంను టెక్‌ ఎం టేకోవర్‌ చేసింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top