మహీంద్రా: దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ వెహికల్! ధర ఎంతంటే?!

 Mahindra Atom Electric Variants, Dimensions, And Specifications Revealed - Sakshi

Mahindra Atom EV: ప్రముఖ దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా కొనుగోలు దారులు శుభవార్త చెప్పింది. సామాన్యులకు సైతం బడ్జెట్‌ ధరలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను వినియోగదారులకు అందిస్తున్నట్లు ప్రకటించింది.   

మహీంద్రా ఆటమ్ పేరుతో కే1, కే 2,కే3. కే4 అనే నాలుగు వేరియంట్ల ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను మహీంద్రా సంస్థ మార్కెట్‌కు పరిచయం చేసింది. మొదటి రెండు కే1, కే3 వేరియంట్‌లు 7.4 కేడ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌తో, మిగిలిన కే2, కే4లు 11.1కే డ్ల్యూహెచ్‌ ప్యాక్‌తో రానున్నాయని తెలిపింది. ఇక ఈ వెహికల్స్‌ పీక్‌ పవర్‌ అవుట్‌ పుట్‌ 11పీఎస్‌గా ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. 

ఆటమ్‌ కే1,కే3 వేరియంట్స్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌తో వస్తుండగా..కే2, కే4 వేరియంట్స్‌లో ఎయిర్ కండిషనర్ సదుపాయం లేదు. 4జీ కనెక్టివిటీతో మొబైల్‌ డాకింగ్‌ స్టేషన్‌ ఫీచర్లు ఉన్నాయి.ఇక ఈ వెహికల్ 2,728 ఎంఎం, 1452 ఎంఎం వైడ్‌, 1576ఎంఎం పొడవు,1885వీల్‌ బేస్‌, 832 కిలోల నుంచి 903 కిలోల బరువుతో కేబిన్‌లో  నలుగురు ప్రయాణికులు, బ్యాక్‌ సీట్‌లో 3 ప్రయాణికులు కూర్చునే సదుపాయం ఉంది. 

ధర ఎంతంటే!
మహీంద్రా ఆటమ్ డిజైన్, ఫీచర్ల పరంగా పైసా వసూల్ కారుగా చెప్పవచ్చు. దీని ధర దాదాపు రూ.3 లక్షలుగా ఉండొచ్చనేది మార్కెట్‌ విశ్లేషకుల అంచనా. మహీంద్రా ఆటమ్ గరిష్ట వేగం గంటకు 50 కి.మీ.గా ఉంటుంది. దీని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. ఆటమ్ ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కి.మీ. వరకు నడుస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top