ఒక్క కారు ధర రూ.3.50 కోట్లు.. అమ్మకాల్లో బద్దలైన 59 ఏళ్ల రికార్డులు

Lamborghini worldwide sales 2021 broken previous records - Sakshi

సూపర్‌ స్పోర్ట్స్‌ కార్‌ లంబోర్గిని సంచలనం సృష్టించింది. బ్రాండ్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా మార్కెట్‌లో చొచ్చుకుపోయింది. కరోనా సంక్షోభం ప్రపంచమంతటా ప్రభావం చూపుతున్నా డోంట్‌ కేర్‌ అన్నట్టుగా అమ్మకాల్లో టాప్‌గేర్‌లో దూసుకుపోయింది. 

59 ఏళ్ల రికార్డులు
ఇటాలియన్‌ కార్‌ బ్రాండైన లంబోర్గినికి ప్రపంచ వ్యాప్తంగా సూపర్‌ స్పోర్ట్స్‌ కార్‌ కేటగిరిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. లంబోర్గిని కార్లకు అన్ని దేశాల్లో స్పెషల్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. రెండేళ్లుగా కరోనాతో తగ్గిన లంబోర్గిని అమ్మకాలు 2021లో పుంజుకున్నాయి. అమ్మకాలు ఏకంగా 59 ఏళ్ల రికార్డులను తిరగ రాశాయి.

ఉరుస్‌దే పై చేయి
లంబోర్గిని బ్రాండ్‌కి సంబంధించి 2021 ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా 8405 కార్లు అమ్ముడయ్యాయి. ఇందులో అత్యధికంగా లంబోర్గిని ఉరుస్‌ మోడల్‌ కారు సేల్‌ అయ్యింది. ఉరుస్‌ మోడల్‌ కార్లే 5,021 అమ్ముడయ్యాయి. ఇండియాలో ఉరుస్‌ కారు ఎక్స్‌షోరూం ధర కనిష్టంగా రూ.3.15 కోట్ల నుంచి రూ.3.43 కోట్ల వరకు ఉంది. ఉరుస్‌ తర్వాత స్థానంలో హురాకాన్‌ మోడల్‌ నిలిచింది. రూ.3.21 కోట్ల నుంచి రూ.4.99 కోట్ల రేంజ్‌లో లభించే హురుకాన్‌ మోడల్‌ కార్లు 2586 యూనిట్లు అమ్ముడయ్యాయి. 

అవెంటాడోర్‌ అదుర్స్‌
ఉరుస్‌, హురున్‌ తర్వాత అవెంటడార్‌ మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 798 అవెంటడార్‌ కార్లు అమ్ముడయ్యాయి. ఇండియాలో అవెంటాడోర్‌ ధర రూ. 6.25 కోట్లు (ఎక్స్‌షోరూమ్‌)గా ఉంది. 2020తో పోల్చితే అమ్మకాల్లో 13 శాతం వృద్దిని లంబోర్గిని కనబరిచింది. ఇండియాలో​ ఉరుస్‌ మోడల్‌కి డిమాండ్‌ ఎక్కువ. దేశవ్యాప్తంగా 300 ఉరుస్‌ మోడల్‌ కార్లను లంబోర్గిని విక్రయించింది. 

చదవండి: డుగ్గుడుగ్గు బండికి గట్టి పోటీ.. యజ్డీ రీ ఎంట్రీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top