న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ప్రపంచ స్థాయి ఎగ్జిక్యూటివ్ లాంజ్

IRCTC To Open World-Class Executive Lounge at Delhi Railway Station - Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో కొత్త ప్రపంచ స్థాయి ఎగ్జిక్యూటివ్ లాంజ్ త్వరలో ప్రారంభించనున్నట్లు ఒక అధికారి మీడియకు వెల్లడించారు. "రైల్వే ప్రయాణీకులు కోసం సౌకర్యవంతమైన సేవలు అందించడం కోసం ఈ కొత్త ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఐఆర్​సీటీసీ నిర్మించినట్లు" అధికారి తెలిపారు. " ఈ లాంజ్ ప్రపంచ స్థాయి సదుపాయాలతో రూపొందించినట్లు" అని ఆయన తెలిపారు. ఈ కొత్త లాంజ్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫారం నంబర్ 1 మొదటి అంతస్తులో ఏర్పాటు చేశారు.(చదవండి: సామాన్యులకు భారీ షాక్.. మరింత పెరగనున్న గ్యాస్ ధరలు)

"ఈ కొత్త ఎగ్జిక్యూటివ్ లాంజ్ లో సందర్శకులకు సంగీతం, వై-ఫై, టీవీ, రైలు సమాచార ప్రదర్శన, పానీయాలు, చాలా రకాల బఫెట్లు వంటివీ ఇందులో అందించనున్నారు" అని అధికారి తెలిపారు. ఇందులో ప్రవేశించడం కోసం ప్రయాణీకులు ప్రవేశ రుసుముగా రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే తర్వాత ప్రతి గంటకు రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. ఇది 24 గంటలు పనిచేస్తుంది. దీనిలో వై-ఫై ఇంటర్నెట్ ఫెసిలిటీ, పుస్తకాలు, మ్యాగజైన్ల రిటైలింగ్, కాంప్లిమెంటరీ టీ, కాఫీ పానీయాలు వంటి అనేక సేవలు ఉంటాయి. ఇక శాఖాహార భోజనం కోసం రూ.250, మాంసాహార భోజనం కోసం రూ.385 చెల్లించాలి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఐఆర్​సీటీసీ ఏర్పాటు చేసిన రెండవ ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఇది. మొదటిది ఇప్పటికే ప్లాట్ ఫారం నెంబరు 16 వద్ద గ్రౌండ్ ఫ్లోర్ లో 2016 నుంచి అమలులో ఉంది. ఇతర రాష్ట్రాల రాజధానులలో ఇలాంటి లాంజ్ ఏర్పాటు చేయనున్నారు.
 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top