వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్‌ సూపర్‌ పిక్స్‌ వైరల్‌  | Sakshi
Sakshi News home page

Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్‌ సూపర్‌ పిక్స్‌ వైరల్‌ 

Published Tue, May 30 2023 4:44 PM

IPL 2023 Csk win Ravindra Jadeja appreciation AI pics goes viral - Sakshi

సాక్షి, ముంబై: ఐపీఎల్ 2023లో చెన్నై థ్రిల్లింగ్ విక్టరీ  నమోదు చేసుకున్నసంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ డక్ వర్త్ లూయిస్ పద్దతిన 5 వికెట్ల తేడాతో  విజయం . ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో జడేజా (6 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 15 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేశాడు. (IPL 2023 విజేత, కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని నెట్‌వర్త్‌ ఎంతో తెలుసా?)

ముఖ్యంగా చివరి 2 బంతులకు 10 పరుగులు చేయాల్సిన ఉండగా, చెలరేగిన జడేజా వరుసగా 6, 4 కొట్టి జట్టుకు మర్చిపోలేని విజయాన్ని అందించాడు. జడ్డూ బాయ్‌ పెర్‌ఫామెన్స్‌కు ఫిదా అయిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భావోద్వేగానికి గురవడమే కాదు..ఎన్నడూ లేని విధంగా మ్యాచ్‌ను గెలిపించిన జడేజాను ఎత్తుకొని సంబరాలు చేసుకున్నాడు మిస్టర్‌ కూల్‌. (ఐపీఎల్‌ 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్‌ నెట్‌వర్త్‌ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు)

దీనికితోడు భర్త ప్రతిభకు ముగ్ధురాలైన జడేజా భార్య  భర్త కాళ్లకు దణ్నం పెట్టి, గట్టిగా కౌగిలించుకుని మరీ మురిసిపోయింది. దీనికి సంబంధించిన  వీడియో  ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

దీనిపై ఏఐ ఆర్టిస్ట్ సాహిద్‌ కూడా సెలబ్రేట్‌ చేశారు. ఇటీవలి కాలంలో అనేకమంది సినీ, రాజకీయ సెలబ్రిటీలు, క్రీడాకారుల ఫోటోలను ఆకర్షణీయంగా మల్చిన సాహిద్‌ ఇపుడు జడేజాను ఎంచుకోవడం విశేషం. ఈ ఫోటోలు  చూసిన ఫ్యాన్స్‌ వారెవ్వా జడేజా అంటూ కమెంట్‌ చేశారు.

 
Advertisement
 
Advertisement