వివాద్‌ సే విశ్వాస్‌ను ఆకర్షణీయంగా మార్చాలి

Industry Asks Government To Make Vivad Se Vishwas Scheme Attractive For MSMEs - Sakshi

ప్రభుత్వానికి ఎంఎస్‌ఎంఈల వినతి

న్యూఢిల్లీ: బడ్జెట్‌లో భాగంగా ప్రకటించిన ‘వివాద్‌ సే విశ్వాస్‌’ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్పులు చేయాలని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈలు) ప్రభుత్వాన్ని కోరాయి. రీయింబర్స్‌మెంట్, వడ్డీ రేట్ల పరంగా ఆకర్షణీయంగా మార్చాలని ఎంఎస్‌ఎంఈలు కోరినట్టు ఓ సీనియర్‌ ప్రభుత్వ అధికారి వెల్లడించారు.

అంతేకాదు, బలమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఆన్‌లైన్‌లో ఉండాలని డిమాండ్‌ చేశాయి. బడ్జెట్‌ అనంతరం డీపీఐఐటీ ఏర్పాటు చేసిన వెబినార్‌లో భాగంగా ఈ అంశాలను ఎంఎస్‌ఎంఈలు లేవనెత్తాయి. టెక్నాలజీ వినియోగంతో వ్యాపార సులభతర నిర్వహణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. 2023–24 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎంఎస్‌ఎంఈలకు వివాద్‌సే విశ్వాస్‌ పథకాన్ని ప్రకటించారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top