‘వాటే లాజిక్‌ .. వాటే లాజిక్‌’.. ఇండిగో!

Indigo Passenger Finds Screw In Sandwich - Sakshi

ఇటీవల కాలంలో పలు విమాన సంస్థలు ప్రయాణికులకు అందించే సేవలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఆహారంలో బొద్దింకలు, రాళ్లు ప్రత్యక్షమవుతున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఆయా ఘటనలపై సదరు విమానయాన సంస్థలు క్షమాపణలు చెప్పడం, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) జరిమానాలు విధిస్తున్నాయి. 

కానీ విమానయాన సేవల్లో ఎలాంటి మార్పులు రావడం లేదు. తాజాగా ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలు కొనుగోలు చేసిన శాండ్‌విచ్‌లో స్క్రూ ప్రత్యక్షమవ్వడంతో నెవ‍్వెరపోయింది. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. 

జ్యోతి రౌతేలా ఫిబ్రవరి 1న బెంగళూరు నుండి చెన్నైకి ఇండిగో ఫ్లైట్‌లో బయలుదేరింది. విమానంలోనే స్పినాచ్ కార్న్ చీజ్ శాండ్‌విచ్‌ను ఆర్డర్‌ పెట్టుకుంది. ఆ శాండ్‌ విచ్‌ను తినడకుండా అలాగే జర్నీ చేసింది.  

Got a screw in my sandwich
byu/MacaroonIll3601 inbangalore

సరిగ్గా చెన్నై విమానశ్రయంలో దిగిన తర్వాత జ్యోతి రౌతేలాను అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ భద్రతా తనిఖీల్లో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇండిగో ఫ్లైట్‌లో ఆర్డర్‌ పెట్టిన శాండ్‌విచ్‌లో బోల్ట్‌ ఉండడం చూసి కంగుతిన్నది. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియాలో ప్రస్తావించారు.

సంబంధిత విభాగంపై చర్యలు తీసుకోవాలని ఇండిగో అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇండిగో అధికారులు మాత్రం .. మీరు విమాన ప్రయాణంలో శాండ్‌ విచ్‌ తిని ఉంటే చర్యలు తీసుకోనే వాళ్లం. కానీ మీరు విమానం దిగిన తర్వాత శాండ్‌ విచ్‌లో బోల్ట్‌ ఉందని ఫిర్యాదు చేస్తే లాభం లేదని చెప్పడంతో నిర్ఘాంతపోయినట్లు చెప్పారు. ఈ విషయంపై నెటిజన్ల ఇండిగో తీరును విమర్శిస్తున్నారు. ప్రయాణికుల పట్ల ఇండిగో బాధ్యతా రహితంగా వ్యవహరించడం సరికాదని హితువు పలుకుతున్నారు. 

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top