నిపుణుల అంచనాల తలకిందులు.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ సూచీలు

Indices Trade Lower With Nifty Around 17,338 - Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట‍్లు భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. గత వారం రెండున్నర శాతం దిద్దుబాటుకు గురైన దేశీయ సూచీల్లో ఈ వారం కొంత రికవరీ కనిపించవచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేశారు. అయితే వారి అంచనాల్ని తలకిందులు చేస్తూ సోమవారం ఉదయం దేశీయ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇక ఉదయం 9.40 గంటల సమయానికి సెన్సెక్స్‌ 224 పాయింట్లు నష్టపోయి 59239 వద్ద, నిఫ్టీ 76 పాయింట్ల స్వల్ప నష్టాల్లో ఉండగా 76 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.    

అదానీ గ్రూప్‌ షేర్లలో అమ్మకాలు తగ్గాయి. దీంతో ఆ కంపెనీకి చెందిన అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభాల్ని ముటగట్టుకుంటున్నాయి. వీటితో పాటు ఎన్‌టీపీసీ, ఐసీఐసీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, నెస్లే, బీపీసీఎల్‌,కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఏసియన్‌ పెయింట్స్‌,హెచ్‌డీఎఫ్‌సీ, అల్ట్రా టెక్‌ సిమెంట్స్‌, బ్రిటానియా షేర్లు పాజిటీవ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. 

అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, బజాజ్‌ ఆటో,యూపీఎల్‌,ఇన్ఫోసిస్‌,ఎథేర్‌ మోటార్స్‌,డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌,టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, ఎయిర్‌టెల్‌,హెచ్‌సీఎల్‌,టెక్‌ మహీంద్రా, విప్రో,టీసీఎస్‌, హీరో మోటో కార్పొరేషన్‌ షేర్లు నష్టాల్లో పయనమవుతున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top