
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రంగాలు కుదేలయ్యాయి. అయితే కరోనా ఉదృతిలోను దేశీయ రియల్ ఎస్టెట్ అభివృద్ది పథంలో దూసుకెళ్తుందని జీఆర్‌ఈటీఐ(గ్లోబల్ రియల్ ఎస్టేట్ పారదర్శకత సూచిక (జీఆర్‌టీఐ) నివేదికను విడుదల చేసింది. దేశంలో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల పెట్టుబడిదారులలో పారదర్శకత నెలకొందని నివేదిక తెలిపింది.
దేశీయ రియల్ ఎస్టేట్ రంగం పారదర్శకత సూచీలో ప్రపంచంలోనే 34 స్థానంలో నిలిచిందని నివేదిక పేర్కొంది. దేశంలో పారదర్శకత పెరగడానికి గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హాబిటాట్ అసెస్‌మెంట్ తదితర సంస్థలు కీలక పాత్ర పోషించాయి. కాగా తాజా సర్వేలో కేవలం రియల్ ఎస్టేట్ రంగాన్నే కాకుండా 210 అంశాలలో పారదర్శకత, స్వయం సమృద్ధి తదితర అంశాలను సర్వే పరిగణలోకి తీసుకొని నివేదికను వెల్లడించింది.
చదవండి: ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీపై సీబీఐ అభియోగం