ఇండియన్‌ బ్యాంక్‌ షేర్ల అమ్మకం,రూ.4వేల కోట్లు సమీకరణే లక్ష్యం | Indian Bank Qualified Institutional Placement Of Shares To Raise Rs 4,000 Crore | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ బ్యాంక్‌ షేర్ల అమ్మకం,రూ.4వేల కోట్లు సమీకరణే లక్ష్యం

Jun 23 2021 8:09 AM | Updated on Jun 23 2021 8:09 AM

Indian Bank Qualified Institutional Placement Of Shares To Raise Rs 4,000 Crore - Sakshi

న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ ఇండియన్‌ బ్యాంక్‌ అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్‌)ను చేపట్టింది. తద్వారా రూ. 4,000 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. షేరుకి రూ. 142.15 ధర(ఫ్లోర్‌ ప్రైస్‌)లో క్విప్‌ను సోమవారం చేపట్టింది. ఇందుకు పెట్టుబడుల సమీకరణ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఈ నెల 24న(గురువారం) సమావేశంకానున్న పెట్టుబడుల కమిటీ క్విప్‌ ఇష్యూ ధర, డిస్కౌంట్, అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులకు షేర్ల కేటాయింపు(క్విబ్‌) తదితరాలను పరిశీలించనున్నట్లు ఇండియన్‌ బ్యాంక్‌ వెల్లడించింది. కాగా.. ఫ్లోర్‌ ప్రైస్‌కంటే దిగువన షేర్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుండదు. అయితే వాటాదారుల అనుమతితో బ్యాంక్‌ కమిటీ 5 శాతంవరకూ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేసేందుకు వీలుంటుంది. ఈ ఏడాది మార్చిలో ఒకేసారి లేదా దశలవారీగా రూ. 4,000 కోట్లు సమకూర్చుకునేందుకు డైరెక్టర్ల కమిటీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. క్విప్‌ నేపథ్యంలో ఇండియన్‌ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3.4 శాతం జంప్‌చేసి రూ. 150 ఎగువన ముగిసింది.  

చదవండి: ఐడీబీఐ వాటాల అమ్మకాల ప్రక్రియ షురూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement