దిగువబాటన భారత్‌ వృద్ధి రేటు

India Gdp Growth Rate Slowing To Expected In Fy24 Says World Bank - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ 2023–24 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్‌ కుదించింది. 6.9 శాతంగా ఉన్న క్రితం అంచనాలను 6.6 శాతానికి కుదిస్తున్నట్లు తన తాజా ఎకనమిక్‌ అప్‌డేట్‌లో తెలిపింది. భారత్‌ 2021–22లో 8.7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకోగా,  ప్రస్తుత 2022–23లో ఈ రేటు 6.9 శాతంగా ఉంటుందని ఇప్పటికే ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది. కాగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును ప్రపంచ బ్యాంక్‌ 6.1 శాతంగా అంచనావేసింది.

అంటే వృద్ధి రేటు క్రమంగా దిగువకే పయనిస్తుందన్నది ప్రపంచ బ్యాంక్‌ అంచనా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి, ఎగుమతులు, పెట్టుబడుల వేగం తగ్గడం తన అంచనాలకు కారణమని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంటోంది. అయితే ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీల్లో భారత్‌ తొలి స్థానంలో ఉంటుందని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది.

చదవండి: టాలెంట్‌ కోసం విప్రో కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top