ఐబీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ చేతికి ఏఎఫ్‌ఎల్‌ఎస్‌ | IBS Software acquires AFLS | Sakshi
Sakshi News home page

ఐబీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ చేతికి ఏఎఫ్‌ఎల్‌ఎస్‌

Feb 23 2023 6:15 AM | Updated on Feb 23 2023 6:15 AM

IBS Software acquires AFLS - Sakshi

తిరువనంతపురం: యాక్సెంచర్‌ ఫ్రైట్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ సాఫ్ట్‌వేర్‌ (ఏఎఫ్‌ఎల్‌ఎస్‌)ను కొనుగోలు చేసినట్లు ఐబీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ తెలిపింది. అయితే డీల్‌ విలువ మాత్రం వెల్లడి కాలేదు. ఈ ఒప్పందంతో తాము ఆకాశ, సముద్ర మార్గంలో రవాణా కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు టెక్నాలజీ సర్వీసులు అందించడానికి సాధ్యపడనున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ వీకే మాథ్యూస్‌ తెలిపారు.

తమ కార్గో, లాజిస్టిక్స్‌ వ్యాపారాన్ని అలాగే కార్యకలాపాలను అంతర్జాతీయంగా మరింత విస్తరించుకునేందుకు ఇది తోడ్పడగలదని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్‌ పరిశ్రమకు సాఫ్ట్‌వేర్‌ సర్వీసులను (ఎస్‌ఏఏఎస్‌) ఐబీఎస్‌ అందిస్తోంది. ట్రావెల్, రవాణా, లాజిస్టిక్స్‌ కోసం చెన్నైలో కొత్తగా డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇది భారత్‌లో తమకు నాలుగోదని వివరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement