Hyper Social CEO Braden Wallake: 'క్రైయింగ్‌ సీఈవో' పోస్ట్‌ వైరల్‌, ఉద్యోగుల్ని తొలగించి ఎలా ఏడుస్తున్నారో చూడండి!

Hyper Social Ceo Braden Wallake Crying Selfie Viral On Social Media - Sakshi

నా ఉద్యోగుల్ని ప్రేమిస్తున్నాను. నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలతో వారిని విధుల నుంచి తొలగించాల్సి వచ్చింది. ఉద్యోగుల తొలగింపు కష్టమైన పనే. అయినా తప్పడం లేదంటూ ఓ సంస్థ సీఈవో సెల్ఫీ తీసి లింక్డ్ ఇన్‌లో పోస్ట్‌ చేశారు. ఆ పోస్ట్‌లో తనని తాను క్రైయింగ్‌ సీఈవో అని ప్రకటించుకున్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్‌ నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతుంది.  
 
ప‍్రపంచ దేశాల్లో తలెత్తిన ఆర్ధిక మాధ్యం, పెరిగిపోతున్న ధరలు, ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధంతో పాటు ఇతర కారణాల వల్ల స్టార్టప్స్‌ నుంచి యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, టెస్లా వంటి అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకుంటున్నాయి.    

ఈ తరుణంలో అమెరికా ఒహియో రాష్టం కొలంబస్ నగరంలో 'హైపర్‌ సోషల్‌' అనే మార్కెటింగ్‌ ఏజెన్సీ ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది. అయితే ఉద్యోగులంటే అమితంగా ఇష్టపడే ఆ సంస్థ సీఈవో Braden Wallake (బ్రాడెన్‌ వాల్‌ ఏక్‌) తొలగింపు అంశాన్ని జీర్ణించుకోలేకపోయారు. కంటతడి పెట్టుకున్నారు. ఏడుస్తున్న ఫోటోను సెల్ఫీ తీసి లింక్డ్‌ ఇన్‌లో పోస్ట్‌ చేశారు. ఉద్యోగుల్ని ఫైర్‌ చేస్తున్నందుకు బాధగా ఉందని, తనకు తానే ఒక 'క్రైయింగ్‌ సీఈవో' అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు. 

గంటల వ్యవధిలో ఆ పోస్ట్‌ నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. దీంతో ఆ పోస్ట్‌కు 30,500 మంది రియాక్ట్‌ అయ్యారు. 6వేల మంది కామెంట్ల వర్షం కురిపించారు. 500మంది ఆ పోస్ట్‌ను షేర్‌ చేశారు. కానీ పలువురు నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంపై 'బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌' సైతం ఈ క్రైయింగ్‌ సీఈవోని ఇంటర్వ్యూ చేసింది. 

సింపతి కోసం
సింపతి కోసమే. ఉద్యోగుల్ని తొలగించి ఎట్లా ఏడుస్తున్నారో చూడండి. అందులో వాస్తవం లేదు. ఇదంతా మార్కెటింగ్‌ స్ట్రాటజీ అంటూ నెటిజన్లు ఖండించడంతో బ్లూమ్‌బర్గ్‌.. బ్రాడెన్‌ను సంప్రదించింది. 

మార్కెటింగ్‌ స్ట్రాటజీ కాదు
జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు, స్టార్టప్స్‌ సైతం ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి.  మీలా ఉద్యోగుల్ని ఫైర్‌ చేసినందుకు ఏ సంస్థ సీఈవో మీలా ఏడుస్తూ ఇలా పోస్ట్‌లు చేయలేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని బ్లూమ్‌బర్గ్‌ ప్రతినిధులు (ఫోన్‌ ఇంటర్వ్యూలో) ఆయన్ని ప్రశ్నించగా.. నేనేదో మార్కెటింగ్‌ స్ట్రాటజీ, లేదంటే సానుభూతి కోసం ఏడుస్తున్న ఫోటోని పోస్ట్‌ చేయలేదు. 

ఉద్యోగం కోల్పోయిన నా సంస్థ ఉద్యోగులకు ఉపయోగపడుతుందని పోస్ట్‌ చేస్తున్నాను. నా పోస్ట్‌ వల్ల నా మాజీ ఉద్యోగుల‍్లో ఏ ఒక్కరికి ఉద్యోగం వచ్చినా నాకు సంతోషమే' అంటూ వివరణ ఇచ్చారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top