చదువుతూనే రోజుకు రూ.1,200 సంపాదన | How Bengaluru BBA Student Built Rs 1200 Daily Income Stream | Sakshi
Sakshi News home page

చదువుతూనే రోజుకు రూ.1,200 సంపాదన

Aug 20 2026 10:52 AM | Updated on Aug 20 2026 11:04 AM

How Bengaluru BBA Student Built Rs 1200 Daily Income Stream

ఉన్నత చదువులు చదువుకుంటూనే సొంత కాళ్లపై నిలబడాలనే నిశ్చయంతో ముందుకు సాగుతున్న నేటి యువతకు బెంగళూరుకు చెందిన ఒక బీబీఏ విద్యార్థి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కళాశాల సెలవుల సమయాన్ని వృథా చేయకుండా బైక్ టాక్సీ అగ్రిగేటర్ సంస్థ రాపిడోలో క్యాప్టెన్‌గా చేరి రోజుకు సగటున రూ.1,200 వరకు ఆర్జిస్తున్నట్లు సదరు విద్యార్థి ఇటీవల తెలిపాడు.

తన మూడు నెలల పని అనుభవాన్ని పంచుకుంటూ రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు (సుమారు 8.5 గంటలు) రాపిడో క్యాప్టెన్‌గా సేవలు అందించినట్లు పేర్కొన్నాడు. నిలకడైన ప్రణాళిక, కష్టపడే తత్వంతో పని చేస్తే సెలవుల్లోనే కాకుండా చదువుతో పాటు మంచి ఆదాయం పొందవచ్చని నిరూపించాడు. బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో ఉద్యోగ సాధన, గిగ్ ఎకానమీ కల్పిస్తున్న అవకాశాలపై నేటి తరం ఆలోచనా విధానానికి ఈ ఘటన అద్దం పడుతోంది.

సమయ పాలన, ఆర్థిక స్వాలంబన పట్ల ఈ విద్యార్థి చూపిన చొరవ సోషల్ మీడియాలోనూ, ఇతర యువతలోనూ విశేష ఆదరణ పొందుతోంది. కేవలం చదువుకే పరిమితం కాకుండా అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగిస్తూ గిగ్ వర్కర్‌గా మారడం ద్వారా ఒకవైపు పాకెట్ మనీ సంపాదిస్తాన్నాడు. మరోవైపు సమాజంలో రవాణా సేవలు అందించడంలో భాగస్వామి కావడం గమనార్హం.

ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్ల చెరలో చిన్నారి ప్రపంచం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement