మెర్సిడెస్‌ బెంజ్‌కు ఏమైంది? హై-ఎండ్ ఎలక్ట్రిక్ కారు క్రాష్‌ ఫోటో వైరల్‌

highend electric Mercedes Benz EQS luxury EV car crash - Sakshi

సాక్షి, ముంబై: వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ దుర్మరణం తరువాత మెర్సిడెంజ్‌ బెంజ్‌కు చెందిన మరో లగ్జరీ కారు ప్రమాదానికి గురి కావడం ఆందోళన రేపుతోంది.  సుమారు రూ.1.6 కోట్ల విలువైన మెర్సిడెస్‌ బెంజ్‌ ఈక్యూఎస్‌ లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ ప్రమాదానికి గురైంది. ముంబైలో  ప్రమాదానికి గురైన ఈ కారు ఫోటోలను కార్‌ రివ్యూ సంస్థ టీం బీహెచ్‌పీ షేర్ చేసింది. ముఖ్యంగా కారు ముందుభాగం, బంపర్‌ ధ్వంసమైన ఫోటో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఏమైంది బెంజ్‌కార్లకు అంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హై-ఎండ్ ఎలక్ట్రిక్ కారు ప్రమాదానికి గురికావడం ఇదే తొలిసారి. (అమెజాన్‌లో పింక్‌ స్లిప్స్‌ కలకలం, వేలమందిపై వేటు!)

మెర్సిడెస్‌ బెంజ్‌ ఈక్యూఎస్‌ లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ కారును మెర్సిడెస్-బెంజ్ ఈ ఏడాది కొంత కాలం క్రితం భారత మార్కెట్లో పరిచయం చేసింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేతులమీదుగా ఈ అత్యాధునిక ఎలక్ట్రిక్ కారు లాంచ్‌ అయింది. ఒక్కరోజులోనే భారత మార్కెట్ నుంచి 300 ఆర్డర్లను సాధించింది. జర్మనీ మినహా ఇండియాలో మాత్రమే లభ్యమవుతున్న  దీని ధర రూ. 1.55 కోట్లకు పైమాటే. 107.8 kWh  బ్యాటరీ సామర్థ్యంతో దేశంలో అందుబాటులో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ వాహనాలకంటే  ఎక్కువగా సింగిల్‌ ఛార్జ్‌పై గరిష్టంగా 857 కిలోమీటర్ల మైలేజీతో  4.1 సెకన్లలో 100 కిమీ/గం వరకు దూసుకుపోతుందని రిలీజ్‌ సందర్బంగా బెంజ్‌ వెల్లడించింది. 

ఇదీ చదవండి: ప్రేమలో పడిన మిలిందా గేట్స్‌, కొత్త బాయ్‌ ఫ్రెండ్‌ ఎవరో తెలుసా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top