త్వరలో విడుదలకానున్న కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్.. టీజర్ కూడా వచ్చేసింది!

Hero new electric scooter teaser launch soon - Sakshi

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేవారు రోజురోజుకి ఎక్కువవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పాపులర్ కంపెనీల దగ్గర నుంచి, చిన్న కంపెనీల వరకు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ 'హీరో ఎలక్ట్రిక్' ఒక కొత్త స్కూటర్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది.

హీరో ఎలక్ట్రిక్ త్వరలో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్‌ను కంపెనీ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇందులో హీరో కొత్త స్కూటర్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న ఆప్టిమాను పోలి ఉందని తెలుస్తోంది. ఇది ఈ నెల 15న (2023 మార్చి 15) విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

లేటెస్ట్ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ విషయానికి వస్తే, దీని ఫ్రంట్ కౌల్ టాప్‍ పొజిషన్‍లో ఎల్ఈడీ హెచ్‍ల్యాంప్, సెంటర్‌లో ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు ఉన్నాయి. అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, కర్వీ సీట్, గ్రాబ్ రెయిల్, బ్లూ పెయింట్ థీమ్‍తో ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రానున్న ఈ టీజర్ ద్వారా తెలుస్తోంది.

(ఇదీ చదవండి: కొత్త కారు కొనేవారికి శుభవార్త.. మారుతి కార్లపై అదిరిపోయే ఆఫర్స్)

కనెక్టెడ్ టెక్నాలజీ కూడా ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఉండే అవకాశం ఉంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇంకా చాలా విషయాలను వెల్లడించాల్సి ఉంది. ఇవన్నీ లాంచ్ సమయంలో కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది. ఇప్పటికే కంపెనీ ఏడు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ విక్రయిస్తోంది. ఇప్పుడు రాబోయే మోడల్ 8 వ స్థానంలో ఉంటుంది.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top